Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమె భర్తగా గర్వపడుతున్నా.... ఈ జీవితం ఆమెకే అంకితం : లినీ భర్త

కేరళ రాష్ట్రాన్ని వణికించిన నిపా వైరస్‌ సోకిన రోగులకు చికిత్స అందిస్తూ ప్రాణాలు లినీ అనే నర్సు ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్తగా గర్వపడుతున్నట్టు సజీష్ వ్యాఖ్యానించారు. తన భార్యతో మాట్లాడిన చివరి మాటలన

Webdunia
బుధవారం, 23 మే 2018 (16:35 IST)
కేరళ రాష్ట్రాన్ని వణికించిన నిపా వైరస్‌ సోకిన రోగులకు చికిత్స అందిస్తూ ప్రాణాలు లినీ అనే నర్సు ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్తగా గర్వపడుతున్నట్టు సజీష్ వ్యాఖ్యానించారు. తన భార్యతో మాట్లాడిన చివరి మాటలను ఆయన గుర్తుచేసుకుంటున్నాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళుతున్న సమయంలో లినీ చివరిసారిగా ఫోన్ చేసిందని.. జ్వరం ఇంకా తగ్గలేదని చెప్పినట్లు సజీష్ తెలిపాడు.
 
ఆమె చికిత్స చేసిన నిపా వైరస్ బాధిత రోగి చనిపోయిన సంగతి తెల్సిందే.  లినీ చాలా బాధపడిందని.. ఏడ్చిందని చెప్పాడు. లినీ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందిన తర్వాత.. ఆరోగ్యం మెరుగవుతుందని భావించానని.. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదని సజీష్ ఆవేదన వ్యక్తంచేశాడు. 
 
అయితే, లినీ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిందని.. ఆమె అంకిత భావాన్ని అందరూ అభినందిస్తుంటే గర్వంగా ఉందని సజీష్ చెప్పాడు. లినీ ఎప్పుడూ వృత్తి ద్రోహానికి పాల్పడలేదని నూటికి నూరు పాళ్లు నిజాయితీగా పనిచేసేదని తెలిపాడు. ఆమె భర్తగా గర్వపడుతున్నట్టు సజీష్ వ్యాఖ్యానించాడు. కాగా, లినీ ఉద్యోగాన్ని సజీష్‌కు కేరళ ప్రభుత్వం ఇవ్వనుంది. 
 
కాగా, నపా వైరస్ బారిన పడి కేరళలో ఇప్పటివరకు 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో లినీ ఒకరు. అలాగే, మరికొందరు ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. మరోవైపు, ఈ వైరస్ కర్ణాటక రాష్ట్రానికి కూడా వ్యాపించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న ఇద్దరిని ఆ రాష్ట్ర వైద్యులు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments