Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు రాహుల్ అయితే ఏంటి.. మినహాయింపు ఇవ్వాలా? ఢిల్లీ హైకోర్టు

మీరు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అయితే ఏంటి.. ఆయనకు ఎందుకు మినహాయింపు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. విచారణలో ఉన్న నేషనల్ హెరాల్డ్ కేసు తాజా సమాచారాన్ని ప్రచురించకుండా ఉండాలన్న రాహుల్

Webdunia
బుధవారం, 8 ఆగస్టు 2018 (17:37 IST)
మీరు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అయితే ఏంటి.. ఆయనకు ఎందుకు మినహాయింపు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. విచారణలో ఉన్న నేషనల్ హెరాల్డ్ కేసు తాజా సమాచారాన్ని ప్రచురించకుండా ఉండాలన్న రాహుల్ తరపు విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.
 
అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియా సంస్థలకు ఏఐసీసీ దాదాపు రూ.99 కోట్లు బదిలీ చేసిందని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి కేసు పెట్టారు. ఎలాంటి వడ్డీ లేకుండానే నేషనల్ హెరాల్డ్ యాజమాన్య సంస్థకు కాంగ్రెస్ పార్టీకి ఈ నిధులను బదిలీ చేసిందన్నది స్వామి ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలను కూడా ఆయన సమర్పించారు. 
 
యంగ్ ఇండియాకు రాహుల్ డైరెక్టరుగా ఉన్నారనీ, కావాలనే ఆ విషయాన్ని కోర్టు ముందు దాచి ఉంచారని ఆదాయపన్ను శాఖ అధికారులు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కోర్టు.. ఆ వివరాలు వెల్లడించాల్సిన బాధ్యత రాహుల్ మీద ఉందా లేదా అని వ్యాఖ్యానించింది. 
 
రాహుల్ ఎలాంటి ఆదాయాన్ని పొందలేదని, కాబట్టి ఆ ఆరోపణల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాహుల్ తరపు లాయరు వాదించారు. అయితే, ఈ అంశాలను ప్రచురించకుండా మీడియాను ఆదేశించాలని కోరగా అందుకు కోర్టు తిరస్కరించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments