ఆటో నడుపుతున్న 8 ఏళ్ల బాలుడు, నేనున్నానన్న నారా లోకేష్

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (20:53 IST)
కుటుంబాన్ని పోషించాలన్న సంకల్పం, ప్రాణం పోయినా ఫర్వాలేదనుకునే మొండితనం 8 సంవత్సరాల గోపాలక్రిష్ణారెడ్డిని ఆటో నడిపేలా చేసింది. తల్లిదండ్రులకు కళ్ళు కనిపించకుండా కుటుంబ పోషణ బరువైతే అంతా తానై ముందు నిలబడ్డాడు. 
 
3వ తరగతి చదువుతూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిన్నారి ఆవేదనను చూసిన నారా లోకేష్‌ స్పందించారు. చిన్నారి కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చాడు. 
 
తక్షణ సహాయంగా 50వేల రూపాయల నగదు, అలాగే గోపాలక్రిష్ణారెడ్డి నడుపుతున్న ఆటోకు 2 లక్షల రూపాయల సహాయం టిడిపి ద్వారా ఇస్తానని ప్రకటించారు. అంతేకాదు చిన్నారిని ఉన్నత విద్య అభ్యసించేందుకు అయ్యే మొత్తం ఖర్చును తానే భరిస్తానని నారా లోకేష్‌ హామీ ఇచ్చాడు.
 
ఆ హామీతో గోపాలక్రిష్ణారెడ్డి కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. తండ్రి పాపిరెడ్డి, రేవతిల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులు ఉన్నారు.
 
త్వరలోనే వారి అకౌంట్లలోనే డబ్బులను జమ చేయనున్నారు నారా లోకేష్. అలాగే నేరుగా వెళ్ళి లోకేష్‌ను పాపిరెడ్డి కుటుంబం కలవబోతోంది. లోకేష్ తీసుకున్న నిర్ణయంపై టిడిపి నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమకి పులిహోర కలిపుకుంటున్న తరుణ్ భాస్కర్, మానస చౌదరి

Dhanush: కరసామిగా ధ‌నుష్ పోరాటం ఎవరిపైనే తెలియాలంటే టీజర్ చూడాల్సిందే

నాకు ఏమైనా జరిగితే ఆ నలుగురు రే బాధ్యులు :దర్శకుడు షెరాజ్ మెహదీ

Ritesh Rana: క్రేజీ మోహన్ కామెడీ స్టైల్ నాకు చాలా ఇష్టం : రితేష్ రానా

ఫెమినా కవర్ పేజీలో ధురందర్ హీరోయిన్ సార్ అర్జున్.. స్టార్‌డమ్ అదిరిందిగా.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు

పార్కిన్సన్స్ రోగుల కోసం మెడ్‌ట్రానిక్ అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిస్టమ్‌

heat stroke వడదెబ్బ తగ్గేందుకు చిట్కాలు

ఎముక పుష్టి కోసం క్యాల్షియం వున్న ఆహార పదార్థాలు ఇవే

ఫస్ట్ లుక్: స్టెల్లా మెక్‌కార్ట్‌నీ హెచ్ అండ్ ఎం కలెక్షన్‌ని లాంచ్ చేసిన హెచ్ అండ్ ఎం

తర్వాతి కథనం
Show comments