Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా తమ్ముడు లుక్ అదిరిపోయింది: మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (18:33 IST)
మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు లుక్ లో అదిరిపోయాడని ప్రశంసించారు. అసలు తమ్ముడు పవన్ కళ్యాణ్ తో ఇలాంటి చిత్రం చేయొచ్చు అని డిసైడ్ చేసిన దర్శకుడు క్రిష్ కు నా అభినందనలు. ఈ హిస్టారికల్ చిత్రాన్ని తీయాలని సంకల్పించిన మెగాసూర్య మూవీస్‌ని అభినందిస్తున్నా అన్నారు.
 
కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు లుక్ టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది. పవన్ లుక్ డిఫరెంటుగా వుందనీ, ఈ చిత్రం ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందని అంటున్నారు. వచ్చే 2020 సంక్రాంతికి విడుదల కానుంది. ఇదిలావుంటే ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.
 
మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి ఔరంగజేబు కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఔరంగజేబుగా అర్జున్ రాంపాల్ నటించనున్నారట. ఆయన సోదరి పాత్రలో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కనిపించనున్నట్లు సమాచారం. ఔరంగజేబు సోదరికి హరిహర వీరమల్లుకు మధ్య కెమిస్ట్రీ ఏంటన్నది మరో పాయింట్.
 
ఇకపోతే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. పవన్ సరసన నిధి అగర్వాల్ నటించనుంది. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

డాకు మహారాజ్ నుంచి బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా పై దబిడి దిబిడి సాంగ్

రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేయాలంటే నా పర్మిషన్ తీసుకో : రాజమౌళి

రెండోసారి తల్లి కాబోతోన్న ఇలియానా..

ప్రేక్షకులు ఎక్కువ రావడం వల్లే తొక్కిసలాట... బన్నీ తప్పేమీ లేదు : బోనీ కపూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments