Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆర్ఎస్ ఏపీలో, చంద్రబాబు తెలంగాణలో పోటీచేస్తే?: ప్రకాష్ రాజ్

Webdunia
ఆదివారం, 25 నవంబరు 2018 (16:18 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని విలక్షణ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాష్ రాజ్ కొనియాడారు. కానీ తెలంగాణ వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు 15 సీట్లతో సీఎం అవుతారా అని ప్రజలు ప్రశ్నించాలన్నారు. భవిష్యత్తులో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం వస్తే ఎటువైపు మొగ్గుచూపుతారని అడగాలన్నారు. ఇక తనకు కాంగ్రెస్ అంటే ఇష్టమని, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య తన ఫేవరేట్ నాయకుడని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. 
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. కానీ టీఆర్ఎస్ వెళ్లి ఏపీలో, చంద్రబాబు తెలంగాణలో పోటీ చేయడంపై ఆలోచించాలన్నారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదన్ని స్పష్టం చేశారు. కేసీఆర్ చెప్పినట్లు ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం వుందని ఎత్తిచూపారు.
 
తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు కబడ్డీ మ్యాచ్‌లు కావని.. కోట్లాదిమందికి ముఖ్యమైన ఎన్నికలని ప్రకాష్ రాజ్ గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణకు కేసీఆర్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీలతో సంబంధం లేకుండా ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. రాష్ట్రం గురించి ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments