Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకరు వైద్యుడు.. మరొకరు కూలీ.. ఇంకొకరు బయోటెక్నాలజీ హెచ్‌వోడీ... భాగ్యనగరిలో ఉగ్ర కుట్ర

Webdunia
మంగళవారం, 9 మే 2023 (22:11 IST)
హైదరాబాద్ నగరంలో ఉగ్ర లింకు డొంక కదిలింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసులు భాగ్యనగరికి వచ్చి ఐదుగురు ఉగ్ర అనుమానితులను అరెస్టు చేశారు. వీరిలో ఒకరు బయోటెక్నాలజీ విభాగం అధిపతి కాగా, మరొకరు దంత వైద్యుడు.. ఇంకొకరు ఆటో డ్రైవర్ కావడం గమనార్హం. డెంటిస్ట్ నుంచి ఆటో డ్రైవర్ వరకు ఐదుగురు వివిధ వృత్తుల్లో కొనసాగుతున్నారు. వీరిలో ఒకరు తన పేరును మహ్మద్ అబ్బాస్ కాస్త వేణు కుమార్ పేరు మార్చుకున్నాడు.
 
మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన ఐదుగురిలో హైదరాబాద్ నగరంలో ఓ కాలేజీలో బయోటెక్నాలజీ విభాగం అధిపతిగా పనిచేస్తున్నారు. ఈయన పేరు మహమ్మద్ సలీం. భోపాల్‌కు చెందిన ఈయన కొన్ని రోజులుగా గోల్కొండలో ఉంటున్నట్టు గుర్తించారు. 
 
అలాగే, ఒరిస్సాకు చెందిన అబ్దుల్ రహమాన్‌ను క్లౌడ్ సర్వీసెస్ ఇంజనీర్‌గా గుర్తించారు. ఈయన కూడా గోల్కొండలోనే ఉంటున్నారు. గోల్కొండ బజార్‌కు చెందిన షేక్ జునైద్ ఓ దంతవైద్యుడుగా పని చేస్తున్నాడు. హఫీజ్ నగర్‌కు చెందిన మహహ్మద్ అబ్బాస్ అలీ ఆటో డ్రైవర్‌గా, జగద్గరిగుట్టలోని మగ్ధూమ్ నగర్‌కు చెందిన మహ్మద్ హమీద్‌గా గుర్తించగా, ఆయన రోజువారీ కూలీగా పని చేస్తున్నాడు. 
 
అదేవిధంగా జవహర్ నగర్ బాలాజీ నగర్‌కు చెందిన మహమ్మద్ సల్మాన్ పరారీలో ఉన్నట్టు తెలంగాణ నిఘా వర్గాలు వెల్లడించాయి. భోపాల్‌కు చెందిన 11 మంది ఉగ్రవాదులతో కలిసి ఈ ఆరుగురు పనిచేస్తున్నట్టు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ముగ్గురు మతమార్పిడి చేసుకున్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులు మహమ్మద్ సలీం పేరు సౌరభ్ వైద్య. అబ్దుల్ రహమాన్ పేరు దేవీ ప్రసాద్. 
 
మహమ్మద్ అబ్బాస్ పేరు వేణుకుమార్‌గా ఉన్నారు. వీరు మతం మార్చుకున్నారా? లేక పేర్లు మార్చుకున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర నిఘా వర్గాలు అందించిన సమాచారం మేరకు ఎంపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఈ 11 మందిని అరెస్టు చేసింది. అలాగే తమిళనాడులో కూడా మరో ఐదుగురు ఉగ్ర అనుమానితులను జాతీయ దర్యాప్తు బృందం ఎన్.ఐ.ఏ అధికారులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments