Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబుకు షాక్... ఏపీలో మోత్కుపల్లి యాత్ర... విజయసాయిరెడ్డి భేటీ అందుకేనా?

తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులుతో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. ఇది రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించుకున్న‌ట్టు సమాచారం. ఇటీవ‌ల మోత్కుప‌ల్లి చంద్ర‌బా

Webdunia
శుక్రవారం, 15 జూన్ 2018 (13:38 IST)
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులుతో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. ఇది రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించుకున్న‌ట్టు సమాచారం. ఇటీవ‌ల మోత్కుప‌ల్లి చంద్ర‌బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం తెలిసిందే. ఆంధ్ర్ర‌ప్ర‌దేశ్‌లో యాత్ర చేసి చంద్ర‌బాబు అస‌లు రంగు బ‌య‌ట‌పెడతాన‌ని మోత్కుప‌ల్లి గ‌తంలో ప్ర‌క‌టించారు. 
 
దీంతో  ఏపీలో మోత్కుపల్లి యాత్రకు తమ పార్టీ మద్దతు ఉంటుందని విజయసాయిరెడ్డి అన్నట్టు తెలుస్తోంది. ఇటీవల మహానాడు సందర్భంగా మోత్కుపల్లిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తాను తెలుగుదేశం పార్టీకే తన జీవితాన్ని అంకితం చేశానని అప్పట్లో కంటతడి పెట్టుకున్నారు. 
 
యాదాద్రి జిల్లాలోని ఆలేరులో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో మోత్కుపల్లితో విజయసాయిరెడ్డి భేటీ చర్చనీయాంశంగా మారింది. మ‌రి.. మోత్కుప‌ల్లి ప్లాన్ ఏంటి..? ఏపీ యాత్ర ద్వారా ఏం చేయాల‌నుకుంటున్నారో?

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments