చైనాకు భారత్ మరో షాక్, 43 మొబైల్ యాప్స్ నిషేధం

Webdunia
మంగళవారం, 24 నవంబరు 2020 (19:27 IST)
భారతదేశం సార్వభౌమాధికారం, సమగ్రతకు, రక్షణకు భంగం కలిగించే కార్యకలాపాలను సాగిస్తున్నట్లు తేలడంతో 43 మొబైల్ యాప్స్‌ను భారత ప్రభుత్వం నిషేధించింది. తాజాగా నిషేధించబడిన యాప్స్‌లో నాలుగు చైనా రిటైల్ దిగ్గజం అలీబాబా గ్రూప్ యాజమాన్యానికి చెందినవి ఉన్నాయి.
 
"43 మొబైల్ యాప్స్ ప్రాప్యతను నిరోధించే సమాచార సాంకేతిక చట్టం యొక్క సెక్షన్ 69ఎ కింద భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది" అని ప్రభుత్వ ప్రకటనలో పేర్కొంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి అందుకున్న సమగ్ర నివేదికల ఆధారంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
 
తూర్పు లడఖ్ యొక్క గాల్వన్ లోయలో చైనా దళాలతో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించిన తరువాత జూన్ నెలలో 59 చైనా మొబైల్ యాప్స్ నిషేధించిన సంగతి తెలిసిందే. వీటిలో టిక్‌టాక్‌తో సహా పబ్‌జి కలిపి మొత్తం ఇప్పటివరకూ 220 యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.
 
నిషేధించబడిన యాప్స్ జాబితా ఈ దిగువన చూడొచ్చు...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీ 4 రోజుల్లో 3.73 కోట్ల రూపాయల వసూళ్లు

Satya: జెట్లీ ఫస్ట్ సింగిల్ సత్య ఈజ్ నాట్ జెట్లీ ఏప్రిల్ 2న రిలీజ్

Dr. Rajasekhar: నాకు తెలియకుండానే జీవిత ఆ బైక్ అమ్మేశారు : హీరో రాజశేఖర్

పళ్లిచట్టంబి మా డ్రీమ్ ప్రాజెక్ట్,మనందరి సినిమా కాబోతోంది - టొవినో థామస్

Vaishnavi: 2 మిలియన్లను దాటిన ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ లోని తొలి గీతం సంచారమే.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?

అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్-తమిళనాడు చాప్టర్ భాగస్వామ్యం

రవీనా టాండన్, రాషా థడానీలతో తల్లి-కూతుళ్ల నమ్మకాన్ని వేడుక చేసిన గార్నియర్ కలర్ నాచురల్స్

మహిళల్లో రుతుక్రమం ఎందుకు ఆలస్యం, ప్రధాన కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments