Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్‌పై మెలానియాకు కోపం వచ్చింది- భార్య చెప్తే వినాలి..ఆ ఫోటో వైరల్.?

అమెరికా- మెక్సికో సరిహద్దు విషయంలో అమెరికా అధ్యక్షుడు ఈ మధ్యే తీసుకువచ్చిన జీరో-టాలరెన్స్ అనే భద్రతా పాలసీపై తీవ్రంగా రాజకీయ విమర్శలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ పాలసీపై గత ఆదివారం జరిగిన పితృదినో

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (10:50 IST)
అమెరికా- మెక్సికో సరిహద్దు విషయంలో అమెరికా అధ్యక్షుడు ఈ మధ్యే తీసుకువచ్చిన జీరో-టాలరెన్స్ అనే భద్రతా పాలసీపై తీవ్రంగా రాజకీయ విమర్శలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ పాలసీపై గత ఆదివారం జరిగిన పితృదినోత్సవం కార్యక్రమాల్లో ఫస్ట్ లేడీ, ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ స్పందించారు.


మెలానియా ఇంకా మాట్లాడుతూ.. చిన్నారులను వారి తల్లిదండ్రుల నుంచి వేరు చేసే వలస విధానాలను అంతం చేయాలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మెలానియా వ్యాఖ్యలు ప్రపంచ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. 
 
చిన్నారులు వారి కుటుంబాల నుంచి విడపోవడం మిసెస్‌ ట్రంప్‌కు నచ్చడం లేదని, విజయవంతమైన ఇమ్మిగ్రేషన్‌ పాలసీని రూపొందించడానికి ఇరు పక్షాలు కలిసి వస్తాయని ఆశిస్తున్నారన్నారు. ఒక దేశం అన్ని చట్టాలను పాటించాల్సిన అవసరం ఉందని మెలానియా అధికార ప్రతినిధి స్టీఫెన్‌ గ్రిషామ్‌ తెలిపారు. సాధారణంగా అమెరికా రాజకీయ, పాలన విషయాల్లో మెలానియా స్పందించరు. 
 
అయితే భర్త ట్రంప్ నూతన పాలసీనే బహిరంగంగా వ్యతిరేకించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మెక్సికో నుంచి అమెరికాలోకి అక్రమంగా వస్తున్నారని దాదాపు రెండు వేల మంది చిన్నారుల్ని ప్రభుత్వం వారి తల్లిదండ్రుల నుంచి వేరు చేసి శిబిరాలకు పంపించారు.

ప్రస్తుతం ఈ విషయమై అమెరికా వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంతటి కఠిన హృదయులనైనా భావోద్వేగానికి గురి చేస్తోంది. 
 
కొన్నేళ్ల క్రితం మెడిటరేనియన్ బీచ్‌లో మూడేళ్ల బాలుడు అయ్ లాన్ కుర్ది విగతజీవిగా పడి ఉన్న ఫొటో ప్రపంచ ప్రజలను కలచివేసింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఓ ఫొటో ఎంతో భావోద్వేగానికి గురి చేస్తోంది.

ఈ ఫొటోలో హోండురస్‌కు చెందిన రెండేళ్ల బాలిక ఏడుస్తూ కనిపిస్తోంది. మెక్సికో నుంచి అక్రమంగా సరిహద్దులు దాటుతున్న తల్లిదండ్రులను, వారి పిల్లలను అమెరికా సరిహద్దు దళాలు బలవంతంగా వేరు చేస్తున్న దృశ్యం ఈ ఫొటోలో ఉంది. 
 
ఈ ఫొటోను తీసింది గెట్టీ ఫొటో గ్రాఫర్, పులిట్జర్ అవార్డు గ్రహీత జాన్ మూర్. ఆ చిన్నారి ఏడుస్తున్న సమయంలో ఆమె తల్లిని పోలీసులు విచారిస్తున్నారు. ఇక్కడ తీసిన ఫొటోలపై జాన్ మూర్ స్పందిస్తూ.. తాను ఎంతో భావోద్వేగానికి గురయ్యానన్నారు. కాగా, అమెరికా- మెక్సికో సరిహద్దు విషయంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన వైఖరికి ఈ ఫొటోనే నిదర్శనమంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments