Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్య జీతం ఎక్కువని అనుమానపు వేధింపులు.. జీవితం ఆరిపోయింది...

ఆ భార్యాభర్తలిద్దరూ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. భర్త జీతం కంటే భార్య జీతం ఎక్కువ. దీంతో భార్యపై అనుమానం పెంచుకుని భర్త వేధించసాగాడు. దీనికితోడు ఇద్దరు పిల్లలను తనతోపాటు తీసుకెళ్లాడు. దీంతో ఒంటరిత

Advertiesment
Lady Software Engineer
, శుక్రవారం, 15 జూన్ 2018 (10:11 IST)
ఆ భార్యాభర్తలిద్దరూ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. భర్త జీతం కంటే భార్య జీతం ఎక్కువ. దీంతో భార్యపై అనుమానం పెంచుకుని భర్త వేధించసాగాడు. దీనికితోడు ఇద్దరు పిల్లలను తనతోపాటు తీసుకెళ్లాడు. దీంతో ఒంటరితనం భరించలేక ఆ మహిళ తన జీవితాన్ని అర్థాంతరంగా ఆర్పివేసుకుంది. విశాఖపట్టణంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
విశాఖ చినవాల్తేరు కిర్లంపూడి ప్రిన్స్‌ అపార్టుమెంట్‌లో పీతల అప్పారావు నివాసముంటున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు రెండో కుమార్తె వాణి (35)ని జడ్పీ సమీపంలోని కృష్ణానగర్‌కు చెందిన పసుపులేటి గంగాధర్‌కు ఇచ్చి 2011లో వివాహం చేశారు. 
 
ఈ భార్యాభర్తలిద్దరూ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. వాణికి రూ.7.8 లక్షలు జీతం కాగా గంగాధర్‌ జీతం రూ.4 లక్షలు. వీరికి ఆరేళ్లు, మూడేళ్ల వయస్సు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య జీతం ఎక్కువ కావడంతో ఆమెపై అనుమానం పెంచుకున్నారు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఫలితంగా అమెరికా నుంచి గత యేడాది ఏప్రిల్ నెలలో నగరానికి తిరిగివచ్చేశారు. 
 
వాణి ఇద్దరు పిల్లలతో పుట్టింట్లో ఉంటుండగా, గంగాధర్‌ తన తల్లిదండ్రులతో ఉంటున్నాడు. ఈ పరిస్థితుల్లో గంగాధర్‌ పిల్లలను తన వద్దకు రప్పించుకున్నాడు. అపుడు తాను కూడా వస్తానని భర్తతో భార్య చెప్పింది. కానీ, భర్త సమ్మతించలేదు. 
 
దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. బుధవారం ఎప్పటిలాగే నిద్రపోయింది. ఉదయం బయటకు రాకపోవడంతో అనుమానంతో తలుపులు బద్ధలు కొట్టిచూసేసరికి వాణి అచేతనంగా ఉంది. గంగాధర్‌ వేధింపుల వల్లే వాణి ఆత్మహత్య చేసుకుందని ఆమె సోదరి సుహాసిని ఆరోపించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా నుంచి భారత్‌కు కారులోనే వచ్చేశారు.. విమానం ఎక్కనేలేదు..