Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీనా భర్తకు లివర్ ఇన్ఫెక్షన్... పావురాల మలమూత్ర విసర్జన వల్ల సోకిందట...

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (09:43 IST)
సినీ నటి మీనా భర్త విద్యాసాంగర్ బుధవారం రాత్రి కన్నుమూశారు. గత జనవరిలో మీనా కుటుంబ సభ్యులంతా కరోనా వైరస్ బారినపడ్డారు. ఆ తర్వాత వారు కోలుకున్నారు. కానీ, మీనా భర్త విద్యాసాగర్‌కు మాత్రం పోస్ట్ కరోనా సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎక్కువైంది. దీంతో చెన్నై నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గత కొన్ని రోజులుగా చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలోనే ఆయన లివర్ ఇన్ఫెక్షన్ సోకింది. ఈ వ్యాధి పావురాల మల, మూత్ర విసర్జన వల్ల సోకిందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఆరోగ్యం విషమించింది. పైగా లివర్ మార్పిడి చికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసం దాత కోసం వేచిచూస్తు వచ్చారు. సరిగ్గా దాత లభించగానే మరోమారు ఆయనకు కరోనా వైరస్ సోకింది. 
 
ఫలితంగా ఈ వైరస్‌ నుంచి కోలుకునేందుకు చికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా నుంచి కోలుకునే సమయానికి లివర్‌తో పాటు ఊపిరితితిత్తుల సమస్య కూడా ఉత్పన్నమైంది. దీంతో ఆయనను ఎక్మో సిస్టమ్‌ అమర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. కానీ, ఎక్మో చికిత్సకు కూడా ఆయన స్పందించలేదు. దీంతో విద్యాసాగర్ మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. 
 
బెంగుళూరుకు చెందిన పారిశ్రామికవేత్త విద్యాసాగర్‌ను మీనా 2009లో ప్రేమించి పెళ్లి చేసుకుంది వీరికి నైనిక అనే చిన్నారి కూడా ఉంది. గత కొంతకాలంగా చెన్నై సైదాపేట కోర్టుకు సమీపంలో ఉన్న శ్రీనగర్ కాలనీలోని టెంపుల్ వ్యూ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. మీనా భర్త మృతి పట్ల అనేక మంది సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు. విద్యాసాగర్ అంత్యక్రియలు బుధవారం బీసెంట్ నగరులోని విద్యుత్ దహనవాటికలో జరుగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments