మీటూ ఆరోపణల్లో నిజం లేదు.. లిప్ కిస్ లేదు.. అత్యాచారమూ డూపే..

Webdunia
శుక్రవారం, 7 డిశెంబరు 2018 (10:52 IST)
మీటూ ఉద్యమం పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘయ్ తనపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడంటూ.. నటి మోడల్ కేట్ శర్మ చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని పోలీసులు తేల్చేశారు.


తనను ఇంటికి పిలిపించుకుని.. మసాజ్ చేయమని అడిగారని.. తప్పనిసరి పరిస్థితుల్లో.. కాదనలేక రెండు మూడు నిమిషాలు మసాజ్ చేశానని చేతులు కడుక్కునేందుకు బాత్రూమ్‌లోకి వెళ్తే ఆయన వెనకాలే వచ్చి.. తనతో ఓ రాత్రి గడిపితే.. అవకాశాలు ఇప్పిస్తానని చెప్పారని కేట్ ఆరోపించింది. 
 
లేనట్లైతే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టమని చెప్తూ.. తనపై అత్యాచారానికి ప్రయత్నించారని కేట్ ఆరోపించింది. సినిమా సంగతులు మాట్లాడుతూ.. తనకు లిప్ కిస్ ఇవ్వబోయాడని కేట్ చెప్పింది. కేట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నటి ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని తేల్చారు.

ఇంకా తన తల్లి ఆరోగ్యం బాగాలేదనే సాకుతో దర్శకుడిపై పెట్టిన కేసును కేట్ వెనక్కి తీసుకున్నట్లు చెప్పారు. మరోవైపు సుభాష్ ఘయ్ కేట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా వున్నట్లు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments