Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి విందు.. చపాతీపై ఉమ్మివేసి తయారు చేశాడు.. అరెస్ట్

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (18:12 IST)
chapati
పెళ్లింటే చాలా మందికి గుర్తొచ్చేది వింధు భోజనమే. పెళ్లికి వచ్చిన వారికి రకరకాల పదార్థాలతో వడ్డిస్తారు. కానీ ఇప్పుడు చెప్పేది వింటే ఇకపై పెళ్లిలో భోజనం చేయాలంటేనే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. ఓ పెళ్లి విందులో ఏర్పాటు చేసిన చపాతీల్లో.. ఆ చపాతీలు తయారు చేసే వ్యక్తి ప్రతీ చపాతీపై ఉమ్మి వేసి తయారు చేశాడు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో బయటపడగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలా ఉమ్మివేసి చపాతీ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలే కరోనా కాలం. జనాలు మాస్కులు, శానిటైజర్లు వాడుతున్న తరుణంలో తీసుకునే ఆహారంలో ఇలాంట గలీజు పని చేశాడు. 
 
వివరాల్లోకి వెళితే.. మీరట్‌లో ఓ పెళ్లితంతు ఘనంగా జరిగింది. అక్కడికి వచ్చిన అతిథుల కోసం ఓ వ్యక్తి తందూరీ రోటీలు తయారు చేస్తూ ఉమ్మి వేస్తున్నాడు. చపాతీలను చాక చాక్యంగా తిప్పుతూ ఒకదానిమీద మరొకటి పేర్చి ప్రతీ చపాతీపై ఉమ్మి వేశాడు. అతడు చేసిన పనిని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇంకేముంది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
దీనిపై దర్యాప్తు చేపట్టిన మీరట్ పోలీసులు.. ఈ పనిని మీరట్‌కు చెందిన సోహైల్ చేసినట్లు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తానెప్పుడు చపాతీలు చేయలేదని.. తనకేమి తెలియన్నాడు. వీడియో చూపించి అడుగగా.. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని అంటున్నాడు. దీంతో ఆ వ్యక్తి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments