Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళపై దాడి చేస్తే.. సిగుల్ పక్షి నాలుక కొరికేసింది.. చివరికి..?

మహిళపై దాడి చేస్తే.. సిగుల్ పక్షి నాలుక కొరికేసింది.. చివరికి..?
, సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (16:58 IST)
ప్రేయసీ ప్రియులో లేకుంటే సహజీవనంలో వున్నవారో తెలియదు కానీ వారికి గతంలో పరిచయం లేదని చెప్తున్నారు. అయితే జేమ్స్‌ మెకెంజీ అనే వ్యకి, బెథానీ ర్యాన్‌ అనే మహిళ ఎడిన్‌బర్గ్‌లో నడుచుకుంటూ వెళ్తున్నారు. వీరిద్దరికి గతంలో పరిచయం కూడా లేదు. అయితే ఆ సమయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో మెకెంజీ పిడికిలి బిగించి ఆమె మీదకు వెళ్లబోయాడు. అంతలో ర్యాన్‌ ఊహించని విధంగా అతడ్ని కిస్‌ చేసింది.
 
ఈ క్రమంలో మెకెంజీ నాలుక చివరి భాగాన్ని కొరికింది. అది తెగి పడగా అంతలో ఒక సిగుల్‌ పక్షి దానిని నోటకరుచుకుని ఎగిరిపోయింది. ఇలా సదరు మహిళపై దాడికి యత్నించిన వ్యక్తి నాలుకను కొరికిన పక్షి.. తెగిన నాలుక ముక్కను సముద్రపు పక్షి నోటకరుచుకునిపోయింది. దీంతో తెగిన నాలుకను సర్జరీ ద్వారా అతికించేందుకు అవకాశం లేకపోవడంతో అతడు మూగవాడయ్యాడు. ఈ అరుదైన ఘటన బ్రిటన్‌లోని స్కాట్‌లాండ్‌లో జరిగింది. 
 
కాగా, నాలుక తెగి రక్తం కారుతున్న మెకెంజీని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే తెగిన మూడు సెంటీమీటర్ల నాలుక ముక్క కనిపించపోవడంతో దానిని అతికించే సర్జరీని వైద్యులు చేయలేకపోయారు. దీంతో అతడు మాట్లాడలేని వ్యక్తిగా మిగిలాడు. 2019 ఆగస్ట్‌ 1న జరిగిన ఈ ఘటనపై విచారణ జరిపిన ఎడిన్‌బర్గ్‌ ఫరీఫ్ కోర్టు మెకెంజీ నాలుక కొరికిన ర్యాన్‌ను దోషిగా నిర్ధారించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హోటల్ గదిలో విగతజీవిగా కనిపించిన లోక్‌సభ సభ్యుడు