Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రణయ్ హత్య కేసు.. నల్గొండ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు లింకేంటి?

మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎండి కరీమ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం నుంచే కరీమ్‌ను పోలీసులు ప్

Webdunia
ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (11:30 IST)
మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎండి కరీమ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం నుంచే కరీమ్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సుపారీ మాట్లాడటం నుంచి హంతకుల ఏర్పాటు వరకూ ఇతని పర్యవేక్షణలోనే జరిగినట్టు సమాచారం. 
 
కరీమ్ ప్రస్తుతం నల్గొండ జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. ప్రణయ్‌ని హత్య చేయించడానికి మారుతీరావుకు ఇతను సహకరించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తన అల్లుడిని హత్య చేయాలని మారుతీరావు నిర్ణయించుకున్న తర్వాత మిగతా ఫ్లాన్ మొత్తాన్ని కరీమ్ నడిపించినట్టు తెలుస్తోంది.
 
ఇదిలా ఉంటే.. పరువు హత్యకు గురైన ప్రణయ్‌ మృతదేహాన్ని చూసి భార్య అమృత కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ప్రాణానికి ప్రాణంలా ప్రేమించిన భర్త విగతజీవిలా మారిపోవడాన్ని చూసిన అమృత బోరుమంది. అమృతను ఆస్పత్రి నుంచి పోలీసులు ప్రణయ్‌ మృతదేహం వద్దకు తీసుకొచ్చారు. దాంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన అమృత.. కలకాలం నిండు జీవితాన్ని పంచుకోవాలనుకున్న భర్త ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక గుండెలు పగిలేలా రోదిస్తోంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments