Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టికెట్ లేకుండా యువకుడి రైలు ప్రయాణం.. ఫైన్ కట్టాల్సింది పోయి.. ప్రాణాలు?

టికెట్ లేకుండా రైలులో ప్రయాణించిన పాపానికి ఓ యువకుడు ఫైన్ కట్టాల్సింది పోయి.. ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. రైల్వే టీసీ ఓవరాక్షన్ చేయడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వివర

టికెట్ లేకుండా యువకుడి రైలు ప్రయాణం.. ఫైన్ కట్టాల్సింది పోయి.. ప్రాణాలు?
, శనివారం, 15 సెప్టెంబరు 2018 (14:08 IST)
టికెట్ లేకుండా రైలులో ప్రయాణించిన పాపానికి ఓ యువకుడు ఫైన్ కట్టాల్సింది పోయి.. ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. రైల్వే టీసీ ఓవరాక్షన్ చేయడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. తాండూరు నాంపల్లి ప్యాసింజర్ ట్రైన్‌లో.. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న యువకుడ్ని పట్టుకునేందుకు టీసీ ప్రయత్నించాడు. 
 
టీసీకి భయపడి ఆ యువకుడు దూకేయడంతో రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. గొల్లపూడి స్టేషన్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన అనంతరం టికెట్‌ కలెక్టర్‌ను ప్రయాణికులు చితకబాదారు. మృతున్ని వికారాబాద్‌ పరిధి అనంతగిరిపల్లి తండా వాసి కాట్రావత్‌ శివగా గుర్తించారు.
 
రైలులో టికెట్ లేకుండా ప్రయాణించిన యువకుడు టీటీఈని గమనించిన తర్వాత ట్రైన్ నుంచి దూకేయబోగా ఆ అధికారి అతని కాలర్ పట్టుకున్నాడు. దీంతో అదుపు తప్పిన యువకుడు రైలు పట్టాలపై పడిపోయాడు. అతనిపై నుంచి రైలు వెళ్లిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని తోటి ప్రయాణీకులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశామనీ, దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంపింది మా నాన్నే అయినా ఆయన్ను ఉరి తీయాల్సిందే... అమృత