Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంపించింది మా నాన్నే అయినా ఆయన్ను ఉరి తీయాల్సిందే... అమృత

మిర్యాలగూడలో నిన్న జరిగిన పరువు హత్య కేసులో పరారీలో వున్న అమృత తండ్రి మారుతీరావుతో పాటు ఆయన సోదరుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా ఈ హత్య తమ పనేనని వారు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాాయి. మరోవైపు ఆసుపత్రిలో వున్న అమృతను ఎంపీ గుత్తా సుఖేందర్ రె

Advertiesment
Miryalaguda honor Killing
, శనివారం, 15 సెప్టెంబరు 2018 (13:49 IST)
మిర్యాలగూడలో నిన్న జరిగిన పరువు హత్య కేసులో పరారీలో వున్న అమృత తండ్రి మారుతీరావుతో పాటు ఆయన సోదరుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా ఈ హత్య తమ పనేనని వారు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాాయి. మరోవైపు ఆసుపత్రిలో వున్న అమృతను ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇతర నేతలు పరామర్శించారు. ఈ సందర్భంలో అమృత కన్నీళ్లు పెట్టుకుంటూ తన భర్తను చూపించాలంటూ వేడుకుంది.
 
తన తండ్రే తన భర్తను హత్య చేయిస్తాడని తను ఊహించలేకపోయాననీ, తన కళ్లెదుటే అత్యంత దారుణంగా నరికి చంపించిన తన తండ్రిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు ప్రణయ్ కుటుంబ సభ్యులు మారుతీరావును కఠినంగా శిక్షించాలంటూ ఆందోళన చేస్తున్నారు.
 
కాగా నిన్న ఉదయం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రెగ్నెన్సీతో ఉన్న తన భార్యను హాస్పిటల్‌లో చూపించి తిరిగి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వెనుక నుండి తల్వార్‌తో దాడి చేసి ప్రణయ్‌ను హతమార్చాడు. మృతుడు ప్రణయ్ గత ఆరు నెలల క్రితం పట్టణంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏకైక కుమార్తె అమృతను ప్రేమ వివాహం చేసుకొని ఇటీవలే రిసెప్షన్ కూడా గ్రాండ్‌గా చేసాడు. పెండ్లి సమయంలోనే ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొనగా పొలీస్ ఉన్నతాధికారుల జోక్యంతో అ సమస్య సద్దుమణిగింది. కాగా ప్రెగ్నెన్సీతో ఉన్న భార్య అమృతను స్థానిక జ్యోతి హాస్పటల్‌లో చూపించి తిరిగి ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి తల్వార్‌తో దాడి చెయ్యడంతో ప్రణయ్ అక్కడిక్కడే మృతి చెందాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కల్యాణ్‌కు పరాభవం తప్పదు... మళ్లీ బాంబు పేల్చిన శ్రీరెడ్డి