Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ కల్యాణ్‌కు పరాభవం తప్పదు... మళ్లీ బాంబు పేల్చిన శ్రీరెడ్డి

నటి శ్రీరెడ్డి ఓ పట్టాన పవన్ కల్యాణ్‌ను వదిలేట్లు లేదు. ఆయన గురించి ఎవ్వరూ అడగకపోయినా తనే కల్పించుకుని మరీ వ్యాఖ్యానిస్తోంది. తాజాగా ఆమె పవన్ కల్యాణ్ పైన చేసిన వ్యాఖ్య దుమారం రేపుతోంది. ఏపీలో పవన్ కల్యాణ్‌కు ఘోర పరాభవం తప్పదనీ, ఆయన పార్టీ జనసేనకు రెం

Advertiesment
పవన్ కల్యాణ్‌కు పరాభవం తప్పదు... మళ్లీ బాంబు పేల్చిన శ్రీరెడ్డి
, శనివారం, 15 సెప్టెంబరు 2018 (13:12 IST)
నటి శ్రీరెడ్డి ఓ పట్టాన పవన్ కల్యాణ్‌ను వదిలేట్లు లేదు. ఆయన గురించి ఎవ్వరూ అడగకపోయినా తనే కల్పించుకుని మరీ వ్యాఖ్యానిస్తోంది. తాజాగా ఆమె పవన్ కల్యాణ్ పైన చేసిన వ్యాఖ్య దుమారం రేపుతోంది. ఏపీలో పవన్ కల్యాణ్‌కు ఘోర పరాభవం తప్పదనీ, ఆయన పార్టీ జనసేనకు రెండో లేదంటే మూడో సీట్లు వస్తాయనీ, ఆ పార్టీకి అంత సీను లేదని వెల్లడించింది. 
 
ఇకపోతే తను ఏ రాజకీయ పార్టీలోనూ చేరేది లేదనీ, తనను రెండు పార్టీలు ఆహ్వానిస్తున్నాయంటూ చెప్పుకొచ్చింది. మరి ఆహ్వానిస్తున్న పార్టీల పేర్లు మాత్రం చెప్పలేదు. ఇదిలావుంటే తాజాగా శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి వుంది. 
 
ఇదిలావుంటే ఆమె ఇటీవల సచిన్ టెండూల్కర్ మీద చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ కామెంట్లను చూసిన సచిన్ అభిమానులు ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆమెను త్వరగా మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలంటూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం మంచిది కాదని అంటున్నారు. కొందరైతే ఆమెకు సంబంధించిన వీడియోలు తమ వద్ద వున్నాయనీ, ఫేస్ బుక్ కామెంట్లు అదేపనిగా చేస్తే వాటిని లీక్ చేస్తామంటూ పోస్టులు చేస్తున్నారు. 
 
ఇవన్నీ చూసిన శ్రీరెడ్డి వారికి రిప్లై ఇస్తూ... మంచివాళ్లకు ఎఫైర్లు వుండవా? వాళ్లు సమాజంకోసం పాటుపడుతూ వుండవచ్చు.. చూసేందుకు ఎంతో మంచివారిగా కనిపించవచ్చు, ప్రపంచానికంతటికీ చాలా చాలా మంచివారుగా అనిపించవచ్చు, ఐతే అలాంటివారిలో కొంతమంది అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు కొనసాగించిన సందర్భాలు లేవా? నిజాలు మాట్లాడటమే నాకు అలవాటు. నేను చెపుతున్నదాంట్లో తప్పేముంది... అంటూ చెప్పడమే కాకుండా పేరున్నవారి గురించి చెప్పి పబ్లిసిటీ చేసుకునే రకాన్ని తను కాదంటూ పుండు మీద కారం చల్లేసినట్లు వ్యాఖ్యలు చేసింది. మరి ఇవి ఎంతవరకు వెళతాయో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్తూరు మామిడి తోటలో వ్యక్తి హత్య.. అవయవాలపై దారుణంగా?