Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు కాపీ కొట్టేందుకు సాయం చేసిన తండ్రి.. పోలీసులు చితక్కొట్టారు...

Webdunia
ఆదివారం, 5 మార్చి 2023 (13:31 IST)
మహారాష్ట్రలో ఎస్.ఎస్.సి. ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ గట్టి భద్రతా చర్యలు చేపట్టింది. అయితే, ఈ పరీక్షలు రాస్తున్న కొడుక్కి సాయం చేసేందుకు ఓ తండ్రి ప్రయత్నించి, పోలీసులతో తన్నులు తిన్నాడు. ఆ వ్యక్తిని పోలీసులు కొడుతున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
రాష్ట్రంలోని జల్గావ్ జిల్లా చోప్రా తహసీల్ అడవాడ్ గ్రామంలో నూతన్ జ్ఞాన మందిర్ విద్యాలయంలో విద్యార్థులు మరాఠీ పరీక్ష రాస్తున్నారు. ఈ కేంద్రంలో పరీక్ష రాస్తున్న తన కొడుకుకు సాయం చేయాలని ఓ తండ్రి నిర్ణయించుకున్నాడు. కాపీ చేసేందుకు వీలుగా కొన్ని స్లిప్పులు పట్టుకుని పరీక్షా కేంద్రం వద్దకు వెళ్లాడు. తన కొడుకు ఏ గదిలో ఉన్నాడోనని వెతుకుతుండగా విధుల్లో ఉన్న పోలీసులు గమనించి తొలుత హెచ్చరించి, అక్కడ నుంచి పంపించి వేశారు.
 
ఆ తర్వాత మరికొంత సేపటికి మరోమారు ప్రయత్నించేందుకు పరీక్షా కేంద్రం వద్దకు వెళ్లాడు. దీంతో పోలీసులు పట్టుకోవడంతో విడిపించుకుని పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. ఒకటికి రెండుసార్లు పోలీసులు చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. దీంతో ఆ వ్యక్తిని ఓ పోలీస్ లాఠీతో చితకబాదాడు. ఈ తతంగాన్నంతా అక్కడ ఉన్న పోలీసులు తమ ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం