ఎం ఏ చౌదరి దర్శకత్వంలో, కె. కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం "వీరఖడ్గం`. మారుశెట్టి సునీల్ కుమార్ లైన్ ప్రొడ్యూసర్. సృష్టి డాంగే హీరోయిన్. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి మూడో వారంలో విడుదలకు సిద్ధమవుతోన్న సందర్భంగా దర్శకుడు ఎమ్ఏ చౌదరి మాట్లాడుతూ...`` చరిత్ర శిథలమైనా, దాని మూలాలు ఎక్కడో ఒక చోట మిగిలే ఉంటాయి...పగ కూడా అంతే. ఒక మనిషిని నాశనం చెయ్యాలి అనుకుంటే ఎన్ని జన్మలైనా సరే దాన్ని సాధించే వరకు మనిషి జీవితం మసి అయినా, ఆ శవమే మృగమై వెంటాడుతుంది, వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ఈ.... వీరఖడ్గం.
గ్రాఫిక్స్ కి ప్రాధాన్యత ఉన్న చిత్రమిది. నిర్మాత కోటేశ్వరరావు , లైన్ ప్రొడ్యూసర్ సునీల్ కుమార్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. షాయక్ పర్వేజ్ మంచి సంగీతాన్ని సమకూర్చాడు. మార్చి మూడో వారంలో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.
లైన్ ప్రొడ్యూసర్ మారుశెట్టి సునీల్ కుమార్ మాట్లాడుతూ...``నిర్మాతగా నేను గతంలో `రెండో కృష్ణుడు` అనే సినిమా తీశాను. ఆ తర్వాత ఎమ్ఏ చౌదరి దర్శకత్వంలో వచ్చిన `ఇంద్రాణి, చిలిపికృష్ణుడు చిత్రాలకు ఫైనాన్సియర్ గా చేశాను. కథ నచ్చి `వీరఖడ్గం` చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్ గా చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు మాచిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా`` అన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రసన్న కుమార్ మాట్లాడుతూ...``దర్శకుడు ఎమ్ ఏ చౌదరి ప్రతిభావంతుడు. చాలా కాలంగా తెలుసు. పాటలు బావున్నాయి. ఈ సినిమా విజయవంతమై పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా`` అన్నారు.
తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ...``సినిమా చూశాను. మంచి గ్రాఫిక్స్ తో చాలా గ్రాండ్ గా తీశారు. పాటలు కూడా బావున్నాయి. లొకేషన్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించి దర్శక నిర్మాతలకు మంచి పేరు తీసుకరావాలన్నారు.
సంగీత దర్శకుడు షాయక్ పర్వేజ్ మాట్లాడుతూ, ఇందులో నాలుగు పాటలున్నాయి. సునీత , లలిత సాగరి, సాహితి, రామకృష్ణ పాటలు పాడారు. దర్శకుడు చౌదరి గారు నాతో క్వాలిటీ వర్క్ చేయించుకున్నారు. 300 ఏళ్ల క్రితం పార్వతిపురంలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. మ్యూజిక్ కి స్కోపున్న సినిమా అన్నారు.