Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విద్యావిధానం బ్యాక్ డ్రాప్ లో ఆర్ నారాయణ మూర్తి యూనివర్సిటీ : బ్రహ్మానందం

Advertiesment
University Movie Title Unveiled Brahmanandam
, సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (15:56 IST)
University Movie Title Unveiled Brahmanandam
స్నేహాచిత్ర పిక్చర్స్ బ్యానర్ పై ఆర్ నారాయణ మూర్తి నిర్మిస్తూ, దర్సకత్యం వహించిన చిత్రం యూనివర్సిటీ. నూతన నటీనటులతో రూపిందించారు. విజయనగరం చుట్టుపక్కల తీసిన ఈ సినిమా టైటిల్ లోగో ను  పద్మశ్రీ బ్రహ్మానందం  నేడు హైదరాబాద్ లో ఆవిష్కరించారు. అనంతరం బ్రహ్మానందం మాట్లాడుతూ: ఆర్ నారాయణమూర్తి గత 35 సంవత్సరాల అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పటికి అలానే వున్నాడు. స్నేహాచిత్ర పిక్చర్స్ బ్యానర్ పెట్టి ఎన్నో అద్భుత మైన సినిమాలు నిర్మించారు. ఎప్పుడు సినిమా సినిమా నే ప్రాణం ఆయనకి . కళా దర్శకుకు వున్నారు వ్యాపారాత్మక దర్శకులు వున్నారు కానీ ప్రజా దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి ఒక్కడే. చలన చిత్రం అనే సముద్రం వంక అందరూ చూస్తే ఆ సముద్రం చూసే వ్యక్తి ఆర్ నారాయణ మూర్తి. అరుదైన వ్యక్తి ఆర్ నారాయణ మూర్తి. నారాయణ మూర్తి కి తెలిసింది సినిమానే. నమ్ముకున్న సిద్ధాంతం కోసం పాటు పడే వ్యక్తి. ఆర్ నారాయణ మూర్తి తో వచ్చిన వాళ్ళు అందరూ ఎలా ఉన్నారో నారాయణ మూర్తి ఎలా ఉన్నారో నాకు తెలుసు.
 
ఆర్ నారాయణ మూర్తి మంచి హ్యూమన్ బీయింగ్. మల్లెపువ్వు కాదు రోజా పువ్వు కాదు ఆయన ఒక గడ్డి పువ్వు..విద్య బ్యాక్ డ్రాప్ లో యూనివర్సిటీ సినిమా తీశారు. అప్పటి లోఉన్న చదువు ఇప్పుడు లేదు.అప్పుడున్న గౌరవం ఇప్పుడు లేదు. ఇప్పటి గురు శిష్యుల సంబంధం ఏ బార్ లోనో ఎక్కడో చూడవచ్చు. ఇపుడు చదువు కొనే రోజులొచ్చాయి. కొన్ని యూనివర్సిటీలు విద్యను వ్యాపారంగా మార్చేసాయి. ఎడ్యుకేషన్ మాఫియా కధాంసాంతో నారాయణ మూర్తి తీశారు. ప్రేక్షకులకు నా అభిమానులకీ చెప్పేది ఏమిటంటే..ఆర్ నారాయణ మూర్తి తీసిన యూనివర్సిటీ సినిమా అందరూ తప్పకుండా చూడండి.విద్య వ్యవస్థ లోపాలు తెలుసుకోవాలి అంటే ఈ సినిమా చూడండి అని అన్నారు.
 
ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ...గత 40 సంవత్సరాలుగా సినిమాలు తిస్తున్నాను. యూనివర్సిటీ అనే ఈ సినిమా 30 వ సినిమా నాది...ఒక జ్ఞాని, ఒక ప్రొఫెసర్ అయిన బ్రహ్మానందం గారు ఈ ప్రెస్ మీట్ కు రావాలని విజ్ఞప్తి చేసాను వచ్చారు సంతోషం గా ఉంది. ఎడ్యుకేషన్ మీద ఈ సినిమా తీసాను.విజయనగరం పార్లకిమిడి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ తీసాను. అక్కడ నాకు సహకరించిన మంత్రి బొత్స సత్యన్నారాయణ గారికి మిగతా వారికి నా ధన్యవాదములు..వైజాగ్ సత్యానంద్ మాస్టర్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్న స్టూడెంట్స్ ఈ సినిమాలో నటించారు. భారతదేశంలో విద్య వ్యవస్థ వైద్య సంస్థ లు రెండు సేవా రంగాలు అని రాజ్యాంగం చెపుతుంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు ఈ రెండు రంగాలను ప్రవేట్ పరంగా కాకుండా ప్రభుత్వమే నిర్వహించేలా ఉండాలి. విద్యార్థులు జాతి సంపద వారిని కుల మాత భేదం లేకుండా ప్రోత్సహించాలి. విద్య ఇప్పుడు ప్రేవేట్ పరం అయిపోతుంది. భారత దేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల తో తీసాను. ప్రధాని నరేంద్రమోడీ గారు..సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేట్ పరం చేయకుండా మీరిచ్చిన హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబీ సింహా, కాశ్మీర నటించిన వసంత కోకిల ట్రైలర్ ఆవిష్కరించిన మెగాస్టార్ చిరంజీవి