మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలను వణికించిన మిడతల దండు ఇప్పుడు ఒక్కసారిగా హర్యానాలోని గురుగ్రాం పైకి దండెత్తాయి. నగరంలో పెద్దఎత్తున మిడతల దండును చూసి జనం హడలిపోతున్నారు. వీటిని చూసిన రైతులు ఆందోళనకు గురవుతుంటే, మరికొందరు మాత్రం సెటైర్లు వేస్తున్నారు. మిడతలను వండుకుని తింటే చాలా రుచిగా వుంటాయనీ, గురుగ్రాం ప్రజలకు పసందైన కూర దొరికినట్లే అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.