Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో అభిరామి డబ్‌స్మాష్‌లు అబ్బో.. నెట్టింట వైరల్

సోషల్ మీడియా ప్రభావంతో అక్రమ సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ వివాహిత ప్రియుడి మోజులో పడి కన్నబిడ్డలనే కడతేర్చింది. ఆమెకు కట్టుకున్న భర్త, ఇద్దరు కన్నబిడ్డల కంటే ప్రియుడే ఎక్కువ అనుకుంది. అందు

Webdunia
బుధవారం, 5 సెప్టెంబరు 2018 (16:39 IST)
సోషల్ మీడియా ప్రభావంతో అక్రమ సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ వివాహిత ప్రియుడి మోజులో పడి కన్నబిడ్డలనే కడతేర్చింది. ఆమెకు కట్టుకున్న భర్త, ఇద్దరు కన్నబిడ్డల కంటే ప్రియుడే ఎక్కువ అనుకుంది. అందుకే తన ఇద్దరు పిల్లలకు పాలలో విషం కలిపి చంపేసింది. ఆ తర్వాత ప్రియుడితో పారిపోయింది. చెన్నైలోని కుండ్రత్తూరులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ నేపథ్యంలో ప్రియుడితో కలిసి జీవించేందుకు కన్నబిడ్డలను కూడా వదిలించుకున్న అభిరామి అనే ఆ మహిళకు సంబంధించిన డబ్‌స్మాష్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రియుడి కోసం ఇంత దారుణానికి ఒడిగట్టిన అభిరామి వ్యవహారం ఇప్పటికే నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం అభిరామి ప్రియుడితో చేసిన రొమాన్స్‌కు సంబంధించిన డబ్‌స్మాష్‌లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 
 
ఇప్పటికే అభిరామితో పాటు ఆమె ప్రేమికుడు సుందరంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై వీరిద్దరిని పోలీసులు పుళల్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో మ్యూజికలీ యాప్‌లో అభిరామి చేసిన డబ్‌స్మాష్‌ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఆమె ప్రేమికుడు సుందరంతో ఆమె చేసిన డబ్‌స్మాష్‌లను నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు. వాటిలో కొన్ని మీ కోసం...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments