Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేట్టా సాంగ్‌కు కోహ్లీ డ్యాన్సేస్తే ఎలా వుంటుంది.. (వీడియో)

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (15:06 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా సినిమా పేట్టా. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు.  ఈ మూవీలో తలైవా సరసన సిమ్రాన్, త్రిష కథానాయికలుగా నటించారు. తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే యూట్యూబ్‌లో విడుదలైన పాటలకు భారీ వ్యూస్ వస్తున్నాయి. 
 
పనిలో పనిగా సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమా ఆడియోఫంక్షన్‌ను అట్టహాసంగా నిర్వహించింది. 2.0 తర్వాత రజినీకాంత్ చేస్తున్న ఈ సినిమాపై తలైవా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో పోస్టర్లలో రజనీకాంత్ బాగా యంగ్‌గా కనిపిస్తున్నారు. 
 
అంతేగాకుండా హీరోయిన్స్ సిమ్రాన్, త్రిషల లుక్స్ బాగున్నాయి. ఇంకా రజనీకాంత్, విజయ్ సేతుపతి లుక్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. నవాజ్ సిద్ధీఖీ రోల్ ఈ సినిమాకు కీలకం. పేట్టాలో ఆయన లుక్ ఇప్పటికే విడుదలైంది. 
 
ఇక సోషల్ మీడియాలో పేట్టా గురించి వస్తున్న కామెంట్స్‌ను పరిశీలిస్తే.. పేట్టాకు సోషల్ మీడియా మంచి స్థానమే వుంది. ఈ సినిమా లుక్స్, పాటలకు భారీ వ్యూస్, షేర్స్, లైక్స్ వస్తున్నాయి. మాస్ మరణ సాంగ్ యూత్‌ను, రజనీకాంత్ ఫ్యాన్సును బాగా ఆకట్టుకుంటోంది. పేట్టా ఆడియో ఫంక్షన్స్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నాడు. 
 
అలాగే మరణ మాస్ సాంగ్‌ సోషల్ మీడియాలో ఇప్పటికే హిట్ అయిపోయింది. ఇంకా ఊలాలా సాంగ్‌ రజనీకాంత్ ఫ్యాన్సును బాగా ఆకట్టుకుంటోంది. ఈ ఊలాలా సాంగ్‌కు టీమిండియా కెప్టెన్ కోహ్లీ స్టెప్పులేస్తే ఎలా వుంటుందనే వీడియో కూడా పేట్టా సోషల్ మీడియా పేజీలో వుంది. 
 
విరాట్ కోహ్లీ టెస్టు డ్రెస్‌లో మైదానంలో వేసిన తేలిక పాటి స్టెప్పులకు రజనీకాంత్ పేట్టా లోని ఊలాలా సాంగ్ యాడ్ చేశారు. ఈ వీడియోకు 4.8కె లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం తలైవా పాటకు కోహ్లీ డ్యాన్స్ ఎలా వుందో.. మీరూ ఓ లుక్కేయండి..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments