Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ వరదలు.. రెండో అంతస్థులో వున్నా.. కాపాడండి.. సెల్ఫీ వీడియో

కేరళ రాష్ట్రంలో వరదలు భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. వంద సంవత్సరాలకు తర్వాత కురిసిన భారీ వర్షాల కారణంగా కేరళ జిల్లాలు నీట మునిగాయి. కేరళ జలదిగ్భంధంలో మునిగిపోయింది. రాష్ట్రంలో 14 జిల్లాలుంటే

Webdunia
శనివారం, 18 ఆగస్టు 2018 (12:10 IST)
కేరళ రాష్ట్రంలో వరదలు భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. వంద సంవత్సరాలకు తర్వాత కురిసిన భారీ వర్షాల కారణంగా కేరళ జిల్లాలు నీట మునిగాయి. కేరళ జలదిగ్భంధంలో మునిగిపోయింది. రాష్ట్రంలో 14 జిల్లాలుంటే 12 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ సహాయ చర్యలు చేపడుతున్నప్పటికీ మరికొందరు ప్రజలు నీటిలో చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. 
 
తాజాగా తనను కాపాడాలంటూ ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియో చూస్తుంటే కేరళ వాసులు ఎంత దీన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో అర్థమవుతోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వరద నీటితో మా ఇళ్లంతా నిండిపోయిందని.. బయటికి వెళ్లే పరిస్థితి కూడా లేదని ఓ వ్యక్తి సెల్పీ వీడియో పోస్ట్ చేశాడు.
 
దయచేసి తనను కాపాడాలంటూ వేడుకున్నాడు. చెన్నంగూర్‌‌కు చెందిన వ్యక్తి ఆ వీడియోలో.. సమయం గడుస్తున్న కొద్దీ నీటి లెవల్ పెరుగుతోందని.. ప్రస్తుతం తాను రెండో అంతస్థులో వున్నానని.. ఇక్కడ కూడా తన తల వరకు నీరు వచ్చేసింది. అధికారులు గానీ, స్థానిక రాజకీయ నాయకులు గానీ ఒక్కరు కూడా ఇటువైపు రాలేదని చెప్పాడు. ఈ వీడియోను చూసైనా తనను కాపాడాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
మెట్లు ఎక్కి బిల్డింగ్ పైకి వెళ్లేందుకు వీలున్నప్పటికీ.. తాను ఎంత డేంజర్‌లో ఉన్నానో తెలిపేందుకే ఈ వీడియో చేస్తున్నానని వరద బాధితుడు ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఇంటిగోడలు కూలిపోయి.. భవనం కుప్పకూలే ప్రమాదం ఉందని.. తమను కాపాడాలని ప్రాధేయపడుతున్న సెల్ఫీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments