పాకిస్థాన్ కొత్త పెళ్లి జంటకు ఏకే-47 గిఫ్ట్.. వీడియో వైరల్

Webdunia
శనివారం, 28 నవంబరు 2020 (14:06 IST)
పాకిస్థాన్‌లో ఓ పెళ్లి జంట ఏకే-47ను బహుమతిగా పొందింది. పాకిస్థాన్‌కి చెందిన ఒక జంట మాత్రం వెరైటీ బహుమతిని అందుకున్నారు. ఆ జంటకు ఒక మహిళ ఎకె47 రైఫిల్ బహుమతిగా ఇచ్చింది. ఆ బహుమతి చూసి అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు.

కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో వైరల్‌గా మారింది. 30 సెకన్ల వ్యవధి గల ఈ వీడియోలో సదరు మహిళ వరుడికి ఏకే-47 రైఫిల్‌ను బహుమతిగా ఇవ్వడాన్ని చూడవచ్చు. అయితే, వరుడు మాత్రం ఏకే-47 బహుమతిని చూసి ఏ మాత్రం ఆశ్చర్యపోకుండా ముఖం మీద చిరునవ్వుతో దాన్ని అందుకోవడం గమనార్హం. 
 
కాగా, ఈ వీడియోను ''వివాహ బహుమతిగా కలాష్నికోవ్ రైఫిల్" అనే ట్యాగ్ లైన్‌తో ట్విట్టర్లో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోని పరిశీలిస్తే వివాహం పాకిస్థాన్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ట్విట్టర్‌లో వైరల్ అయిన ఈ పోస్టును ఇప్పటివరకు 1.88 లక్షల మందికి పైగా చూడగా... 2.5 వేల మంది లైక్స్ ఇచ్చారు. వీడియోను చూసిన కొందరు నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'బాక్సాఫీస్ కా బాప్' ఆదిత్య ధర్ : 'ధురంధర్‌' మూవీపై రజనీకాంత్ ప్రశంసలు

బాబీ కొల్లి మెగాస్టార్ చిరంజీవి నటించే 158వ చిత్రం

బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర ఆవిష్కరణ : రూ.761 కోట్లు దాటిన 'ధురంధర్ : ది రివెంజ్'

2016లో విడాకులు తీసుకున్నారు... 2026లో మళ్లీ ఒక్కటైన సినీ సెలెబ్రిటీలు

కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు.. 'ఓజీ-2'పై త్వరలో అప్‌డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

తర్వాతి కథనం
Show comments