జో బైడన్ ప్రమాణ స్వీకారం : భారత్‌లో ప్రత్యక్ష ప్రసారాలు ఎపుడు?

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (13:36 IST)
అమెరికా అధ్యక్షుడుగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10 గంటలకు ఈ ప్రమాణ స్వీకారోత్సవ ఘట్టం జరుగనుంది. ఇందుకోసం కేపిటల్ భవనాన్ని సర్వాంగసుందరంగా అలంకరించారు. 
 
అయితే, ఈసారి కరోనా కారణంగా ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించేందుకు అమెరికా మొగ్గుచూపింది. దీంతో ప్రతిసారి లక్షలాది మంది వచ్చే ఈ వేడుక ఈసారి చాలా తక్కువ మంది సమక్షంలో జరగనుంది. అధికారిక సమాచారం ప్రకారం ఓ వెయ్యి మంది మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని తెలుస్తోంది.
 
బుధవారం రాత్రి 8.30 గంటల(భారత కాలమానం ప్రకారం) నుంచి ప్రెసిడెన్సియల్ ఇనాగురల్ కమిటీ(పీఐసీ) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. అదేసమయం నుంచి ఈ వేడుక సామాజిక మాధ్యమాల్లో, టీవీ చానెల్స్‌లో ప్రత్యక్షప్రసారంకానుంది. అయితే, రాత్రి 10 గంటల ప్రాంతంలో అమెరికా జాతీయ గీతంతో అసలు ప్రమాణ స్వీకారోత్సవం ప్రారంభం అవుతుంది. 
 
ఈ కార్యక్రమాన్ని లైవ్‌లో చూడాలనుకునేవారు bideninaugural.org అనే. వెబ్‌సైట్‌లో ప్రత్యక్షప్రసారం కానుంది. దీని ద్వారానే యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల్లో కూడా చూడొచ్చు. అలాగే అన్ని న్యూస్ చానెల్స్‌లో ఇదేసమయంలో ప్రత్యక్షప్రసారం కానుంది. గంటన్నర పాటు ఈ లైవ్ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని 'సెలబ్రేటింగ్ అమెరికా' పేరిట టామ్ హాంక్స్ హోస్ట్ చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాక్టర్ రాజశేఖర్ కాలికి గాయం.. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరం

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments