Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుండపోత వర్షం.. బెంగళూరు కుదేలు.. జేసీపీ ట్రాన్స్‌పోర్ట్ (వీడియో)

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (13:34 IST)
JCP
కుండపోత వర్షంతో కర్ణాటక రాజధాని బెంగళూరు అతలాకుతలమైంది. ఆదివారం రాత్రి మొదలైన భారీ వానలు సోమవారం కూడా తగ్గకపోవడంతో ప్రధాన రహదారులు నదులను తలపించాయి. నివాసాలు, ఐటీ కార్యాలయాల్లోకి మోకాల్లోతు నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 
 
ఒక్క వానకే బెంగళూరు మునిగిపోవడంపై నగరవాసులు అధికార బీజేపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. 'బెంగళూరులో ఇలాంటి పరిస్థితులే ఉంటే, అన్ని ఐటీ కంపెనీలు ఇతర ప్రాంతాలకు తరలిపోతాయని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 
 
ఇలా బెంగళూరు నీటమునగడంపై పలువురు నేతలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అలాగే వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయి. అలా ఓ జేసీపీ ద్వారా ప్రజలను తరలించే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 


 
బెంగళూరు ఇన్నోవేషన్ హబ్ ఇలా తయారైందని సెటైర్లు వేస్తున్నారు. బెంగళూరులో కొత్త ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే కొత్త ఉబెర్ సర్వీస్ అంటూ జోకులు పేలుస్తున్నారు. జేసీపీ ద్వారా ఎలాంటి ప్రమాదం లేకుండా జనాలను సురక్షిత ప్రాంతాలకు చేరవేయవచ్చునని వారు చెప్తున్నారు. ఈ వీడియో ఆధారంగా మీమ్స్ కూడా పేలుతున్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments