ఈనెల 12వ తేదీన కర్ణాటక శాసనసభ పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ముఖ్యంగా, జేడీఎస్ తరపున ఆయన ప్రచారం చేస్తారంటూ వార్తలు గుప్పుమన
ఈనెల 12వ తేదీన కర్ణాటక శాసనసభ పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ముఖ్యంగా, జేడీఎస్ తరపున ఆయన ప్రచారం చేస్తారంటూ వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై జనసేన అధికారి ఒకరు మాట్లాడుతూ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రంలో పర్యటించాలన్న ఆలోచనలో లేరని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షేత్రస్థాయి పార్టీ పటిష్టమే లక్ష్యంగా పర్యటన వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సి వున్నందునే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 175 సీట్లలో పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారని, అందువల్ల పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఆయన దృష్టిసారించారని ఆయన వెల్లడించారు.