దేశంలో తొలిసారి సర్వైకల్ క్యాన్సర్‌కు వ్యాక్సిన్

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (09:54 IST)
దేశంలో తొలిసారి సర్వైకల్ క్యాన్సర్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని సర్వైకల్  కేన్సర్‌తో బాధపడే రోగులకు సెప్టెంబరు ఒకటో తేదీ గురువారం నుంచి వేయనున్నారు. ఈ వ్యాక్సిన్ వివరాలను పరిశీలిస్తే,
 
మన దేశంలో క్వాడ్రివాలెంట్ హ్యూమ్ పాపిలోమావైరస్ వ్యాక్సిన్‌ను సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీతో కలిసి అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్ సర్వైకల్ కేన్సర్‌పై బాగా పని చేస్తుందని వివిధ దశల్లో నిర్వహించిన ప్రయోగాల్లో తేలింది. దేశంలోని యువతకు, అమ్మాయిలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల 30 యేళ్ల తర్వాత ఎదురయ్యే సర్వైకల్ కేన్సర్ నుంచి రక్షణ పొందవచ్చు. 
 
ప్రపంచ మార్కెట్‌లో ఈ వ్యాక్సిన కొరత ఉంది. ఇపుడు మన దేశంలో ఈ వ్యాక్సిన్ తయారు చేయడం ఎంతో శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. ఇది దేశ అవసరాలను తీర్చుతుందని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్ పర్సన్ డాక్టర్ ఎన్.కె. అరోరా తెలిపారు. మరోవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఒక్క భారత్‌లోనే 2019 ప్రకారం దాదాపు 42 లక్షల మంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.
 
సర్వైకల్ కేన్సర్ అంటే... 
సెర్విక్స్‌లో ప్రారంభమయ్యే కేన్సర్ కావడంతో దీన్ని సర్వైకల్ కేన్సర్ అని పిలుస్తారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం మహిళల్లో చాలా మంది సర్వైకల్ కేన్సర్ ముప్పులో ఉన్నారని తెలుస్తోంది. 30 యేళ్ల దాటిన ప్రతి మహిళకు ఈ సర్వైకల్ కేన్సర్ సోకే ప్రమాదం ఉంది. దీర్ఘకాలం ఇన్ఫెక్షన్ కలిగించే హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది సర్వైకల్ కేన్సర్‌కు ముఖ్యకారణంగా చెప్పుకోవచ్చు. ఈ తరహా కేన్సర్‌ను త్వరగా గుర్తించగలిగితే మనిషి జీవన ప్రమాణాల్ని పెంచడం సాధ్యపడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments