Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజమే పైలట్ కనిపించడం లేదు.. గాలిస్తున్నాం : విదేశాంగ శాఖ

India
Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (16:26 IST)
భారత వాయుసేనకు చెందిన ఓ పైలట్ కనిపించడం లేదని భారత విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. అలాగే, మిగ్-21 జెట్ కనిపించకుండా పోయిందనీ విదేశాంగ కార్యదర్శి రవీష్ కుమార్ స్పష్టం చేశారు. అదేవిధంగా పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టు తెలిపారు. 
 
ఇదే అంశంపై బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, భారత వైమానికదళం నిర్వహించిన మెరుపుదాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి చొచ్చుకువచ్చి దాడులు చేసేందుకు ముఖ్యంగా, రక్షణ స్థావరాలపై దాడు చేసేందుకు ప్రయత్నించిందన్నారు. పాక్ యుద్ధ విమానాల రాకను ముందుగానే పసిగట్టిన భారత వైమానికి దళం.. వాటిని ప్రతిఘటించడంతో పాక్ యుద్ధ విమానాలు వెనక్కి తిరిగి వెళ్లిపోయాయని చెప్పారు. అయితే, ఎఫ్-16 రకం యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టు చెప్పారు. 
 
అదేసమయంలో భారత్ వాయుసేనకు చెందిన ఓ మిగ్-21 ఫైటర్ జెట్ కనిపించకుండా పోయిందని ఆయన చెప్పారు. అందులోని పైలట్ కూడా వెనక్కి రాలేదని తెలిపారు. ఆ పైలట్ తమ ఆధీనంలో ఉన్నట్లు పాకిస్థాన్ చెబుతున్నదని, అందులో ఎంత వరకు వాస్తవం ఉందో చూస్తామని రవీష్ కుమార్ చెప్పారు. 
 
కాగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న ఉగ్రతాండాలను లక్ష్యంగా చేసుకుని భారత వైమానికదళం మెరుపుదాడులు జరిపిందన్నారు. ఉగ్రవాదం నిర్మూలనలో భాగంగానే ఈ దాడులు చేశామనీ, ఈ దాడుల వల్ల ప్రజలకు ఎలాంటి హాని తలపెట్టలేదని విదేశాంగ శాఖ కార్యదర్శి రవీష్ కుమార్ స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో ఎయిర్‌ వైస్ మార్షల్ ఆర్జీకే కపూర్ ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments