Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతీయ సినిమాలపై పాకిస్థాన్ నిషేధం : ఎవరికి నష్టం?

భారతీయ సినిమాలపై పాకిస్థాన్ నిషేధం : ఎవరికి నష్టం?
, బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (14:12 IST)
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం మెరుపుదాడులు నిర్వహించింది. ఈ దాడుల కోసం దాదాపు వెయ్యి కిలోల బాంబులను ఉపయోగించారు. ఈ దాడిలో జైషే మొహ్మద్ సంస్థకు చెందిన 350 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. 
 
ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య పరిస్థితులు విషమిస్తున్న తరుణంలో పాకిస్థాన్.. భారతీయ కంటెంట్‌పై నిషేధం విధించింది. ఇక ఏ భారతీయ సినిమా పాకిస్థాన్‌లో విడుదల కాదంటూ పాకిస్థాన్ సమాచార మంత్రిత్వ శాఖ ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాకుండా ప్రకటనలు, యాడ్ ఫిల్మ్‌లను కూడా ప్రదర్శించవద్దని పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ పేర్కొంది. 
 
ఈ నిర్ణయంతో భారతీయ చిత్ర పరిశ్రమకు ఎలాంటి నష్టం వాటిల్లబోదని ఏర్పడదని, నష్టం వాటిల్లేది పాకిస్థాన్‌కేనని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. వ్యాపార వర్గాల సమాచారం ప్రకారం పాకిస్థాన్‌కు వినోదపన్నురూపంలో సుమారుగా రూ.102 కోట్లు వసూలవుతోంది. ఈ నిర్ణయం వలన ఆ ఆదాయానికి గండి పడనుందని విశ్లేషిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను నగ్నంగా నటించలేదే.. అవును శింబు స్నేహం జీవితాంతం కావాలి: ఓవియా