Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశా కేసులో నిందితులకు శిక్ష పడదు, వాళ్లు బైటకు వస్తారు, జనం కొట్టి చంపుతారు

Webdunia
మంగళవారం, 3 డిశెంబరు 2019 (19:19 IST)
సంచలన వ్యాఖ్యలకు మారుపేరు అని పిలుచుకునే తెలంగాణలోని భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశారు. దిశ అత్యాచారం, హత్య గురించి ఆయన మాట్లాడుతూ.. దిశా కేసులో నిందితులకు శిక్ష పడదు, ఎందుకంటే పోలీసులు సరిగా వ్యవహరించలేదు, కాబట్టి వాళ్ళు బయటకు వస్తారు, ఆ తర్వాత జనం వారిని కొట్టి చంపుతారు. ఇది నిజం అంటూ రాజా సింగ్ చెప్పారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... తన నియోజకవర్గంలో పర్యటించేటప్పుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రోటోకాల్ పాటించడంలేదని కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని మారుస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో తెలంగాణా పార్టీ అధ్యక్షుడుగా నాకు ఎవరు కనిపించడం లేదని, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అయితే బాగుంటుందన్నారు. 
 
డీకే అరుణతో పాటు ఎవరికి ఇచ్చిన ఫరవాలేదని,
 
 తాను ఎమ్మెల్యేగా గెలువొద్దని మా పార్టీ నేతలు చాలామంది ప్రయత్నాలు చేశారన్నారు. పార్టీలో కొందరు టికెట్ రాకుండా అడ్దుకున్నారని, అమిత్ షానే తనకు టికెట్ ఇచ్చారన్నారు. పార్టీలో తన ఎదుగుదలను రాష్ట్ర నాయకులు అడ్డుకుంటున్నారని, పార్టీ ఎల్పీ లీడర్‌గా తనను గుర్తించడం లేదన్నారు. తనకు ఏ పదవులు వద్దనీ, తన దారి వేరని అన్నారు. సీఎం కావాలని కలలు కంటున్న వారు తమ పార్టీ లో చాలామంది ఉన్నారన్నారు. కానీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి 
యోగి ఆడిత్యనాథ్ తనకు మార్గదర్శని మనసులో మాట బయటపెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments