Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ టాప్ రీసెర్చ్ యూనివర్శిటీగా ఐఐఎస్‌సీ.. అరుదైన రికార్డు

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (09:41 IST)
ప్రపంచంలోనే అగ్ర పరిశోధనా విశ్వవిద్యాలయంలో బెంగుళూరులోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) అరుదైన ఘ‌నత సాధించింది. బుధ‌వారం రిలీజ్ చేసిన‌ క్యూఎస్ వ‌ర‌ల్డ్ యూనివ‌ర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఈ విష‌యం వెల్ల‌డైంది. 
 
ఇక ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ టాప్ 200 యూనివర్సిటీల్లో చోటు ద‌క్కించుకోగా.. భారత్‌లో బెస్ట్ కాలేజీలుగా త‌మ స్థానాల‌ను నిల‌బెట్టుకున్నాయి. ఐఐటీ గౌహ‌తికి కూడా ఈ లిస్ట్‌లో చోటు ద‌క్క‌డం విశేషం.
 
సైటేష‌న్స్ ప‌ర్ ఫ్యాక‌ల్టీ సూచిక ఆధారంగా ఐఐఎస్‌సీకి ఈ టాప్ ప్లేస్ ద‌క్కింది. లండన్‌కు చెందిన క్వాకరెల్లీ సైమండ్స్ (క్యూఎస్‌) రూపొందించిన ఈ మెట్రిక్‌లో ఐఐఎస్‌సీకి 100కు 100 మార్కులు రావ‌డం విశేషం. 
 
ఇక టాప్ యూనివ‌ర్సిటీ ర్యాంకుల్లో ఐఐఎస్‌సీకి 186వ స్థానం ద‌క్కింది. మన దేశంలోని ఐఐటీ బాంబే, ఢిల్లీ త‌ర్వాత మూడో బెస్ట్ యూనివర్సిటీగా ఐఐఎస్‌సీ నిలిచింది. ఐఐటీ బాంబే తాజా ర్యాంకుల్లో 177వ స్థానం సంపాదించింది. 
 
అయితే, ఈ దఫా కూడా దేశంలో బెస్ట్ కాలేజ్‌గా నిలిచినా.. గ‌తేడాది 172వ స్థానంలో ఉన్న ఐఐటీ బాంబే.. ఈసారి ఐదు ర్యాంకులు కోల్పోయింది. అటు ఐఐటీ ఢిల్లీ మాత్రం 193వ స్థానం నుంచి 185కు ఎగ‌బాకింది. ఈ క్ర‌మంలో ఐఐఎస్‌సీని వెన‌క్కి నెట్టింది.
 
మిగ‌తా ఐఐటీల విష‌యానికి వ‌స్తే ఐఐటీ మ‌ద్రాస్ 20 స్థానాలు ఎగ‌బాకి 255కు చేరింది. ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ 280, ఐఐటీ గౌహ‌తి 395 ర్యాంకుల్లో నిలిచాయి. ఐఐటీ హైద‌రాబాద్ తొలిసారి టాప్ 600లోకి తొలిసారి వ‌చ్చింది. ప్ర‌ధానంగా ఆరు అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ఈ ర్యాంకుల‌ను కేటాయించారు. 
 
ఇక వ‌ర‌ల్డ్ టాప్ యూనివర్సిటీగా వ‌రుస‌గా ప‌దోసారీ మ‌సాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ నిలిచింది. ఆక్స్‌ఫ‌ర్ట్ యూనివ‌ర్సిటీ రెండు, స్టాన్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివ‌ర్సిటీలు మూడో స్థానంలో ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments