Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోరిక తీర్చలేదనే కోపంతో మోడల్‌ను చంపేసిన యువకుడు

ప్రముఖ మోడల్ మానసి దీక్షిత్ హత్య కేసులోని మిస్టరీ వీడింది. కోరిక తీర్చలేదన్న అక్కసుతో ఓ యువకుడు ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. పోలీసులో వెల్లడైన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్ రాష్ట్రంలోని కోట న

Webdunia
గురువారం, 18 అక్టోబరు 2018 (14:21 IST)
ప్రముఖ మోడల్ మానసి దీక్షిత్ హత్య కేసులోని మిస్టరీ వీడింది. కోరిక తీర్చలేదన్న అక్కసుతో ఓ యువకుడు ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. పోలీసులో వెల్లడైన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్ రాష్ట్రంలోని కోట నగరానికి చెందిన మానసి దీక్షిత్ (20) మోడలింగ్ చేసేది. ప్రముఖ మోడల్ మానసి దీక్షిత్ 6 నెలల క్రితం ముంబై నగరానికి వచ్చి అంధేరిలోని మిల్లత్‌నగర్‌లో నివాసముండేది.
 
హైదరాబాద్ నగరానికి చెందిన ముజమ్మిల్ సయ్యద్ (19) ముంబైలోని అంధేరిలో నివాసముంటూ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఓ కార్యక్రమంలో సయ్యద్‌కు మోడల్ మానసి దీక్షిత్‌తో స్నేహం ఏర్పడింది. ఆ పరిచయంతో సయ్యద్ మానసి దీక్షిత్‌ను ఓ రోజు తన ఇంటికి తీసుకెళ్లి కోర్కె తీర్చాలని ఒత్తిడి తెచ్చారు. 
 
ఇంట్లో తన కోరిక తీర్చాలని సయ్యద్ మానసిని అడిగాడు. అందుకు ఆమె తిరస్కరించింది. దీంతో కోపంతో సయ్యద్ స్టూలు తీసుకొని మానసి తలపై కొట్టాడు. అంతే స్పృహ కోల్పోయిన మానసిని లేపేందుకు ఆమెపై సయ్యద్ నీళ్లు చల్లాడు. మానసి కొంచెం స్పృహలోకి వచ్చినా భయపడిన సయ్యద్ తాడును ఆమె మెడకు బిగించి హత్య చేసి ఆ శవాన్ని ట్రావెల్ బ్యాగులో పెట్టిదాన్ని మలాద్ ప్రాంతంలోని మైండ్ స్పేస్ వద్ద పొదల్లో పడేశాడు. 
 
స్థానికులు బ్యాగు నుంచి వాసన వస్తుందని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి బ్యాగు విప్పి చూడగా మోడల్ మానసి దీక్షిత్ మృతదేహం కనిపించింది. రోడ్డుపై సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా సయ్యద్ క్యాబ్‌లో తీసుకొచ్చి మృతదేహాన్ని పొదల్లో పడేసినట్లు తేలింది. క్యాబ్ డ్రైవరు అందించిన సమాచారంతో ఈ కేసు మిస్టరీ వీడింది. దీంతో పోలీసులు సయ్యద్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments