Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెల్ఫీ తీసుకుందామనుకుని చెరువులో దిగారు.. ఆ ముగ్గురు ఏమైయ్యారు..?

సెల్ఫీ తీసుకుందామనుకుని చెరువులో దిగారు.. ఆ ముగ్గురు ఏమైయ్యారు..?
, మంగళవారం, 16 అక్టోబరు 2018 (12:47 IST)
సెల్ఫీ తీసుకుందామని వచ్చాడు.. చివరికి ఆ సెల్ఫీయే అతడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో చోటుచేసుకుంది. సెల్ఫీ తీసుకునేటప్పుడు అతనితో ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారు. వీరు ముగ్గురు ఒకే కళాశాలలో చదువుతున్నారు. జాతీయ సేవ పథకం వాలంటీర్లుగా సేవలందించేవారు.
 
పూర్ణచంద్ర, ముహ్మద్ ముర్తుజా, శశాంక్ అనే ఈ ముగ్గురూ జాతీయ సేవా పథకం శిబిరంలో పాల్గొనేందుకు నేలమంగళ తాలూకా దొబ్బేస్ పేటకు వచ్చారు. ఎన్ఎస్ఎస్ శిబిరం చివరిరోజు సందర్భంగా హలెంజిగల్ చెరువు వద్ద సెల్ఫీలు దిగాలనుకున్నారు. అయితే ముందుగా పూర్ణచంద్ర మెుదట సెల్ఫీ తీసుకుంటానని ఆ చెరువులో దిగాడు.
 
అప్పుడు అతను సెల్ఫీ తీస్తూ చెరువులో మునిగిపోయాడు. అతనిని రక్షించేందుకు మిగిలిన ఇద్దరు స్నేహితులు కూడా నీటిలో దిగారు. కానీ చివరికి ముగ్గురు స్నేహితులు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అసలు విషయం ఏంటంటే.. ఈ ముగ్గురు ఆ చెరువు వద్ద గల దేవాలయాన్ని శుభ్రం చేసేందుకు కళాశాల ద్వారా ఇక్కడి వచ్చారు. కానీ, ఈ సెల్ఫీ క్రేజులో పడి నీళ్లలో మునిగిపోయారని ఎస్పీ మల్లికార్జున చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిజ్జా కొనిపెడతానని గదికి తీసుకెళ్లాడు.. అక్కడ ముగ్గురు..?