Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునకలో ముంబై.... భారీ వర్ష సూచన... లోకల్ ట్రైన్స్ రద్దు

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (15:14 IST)
దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో మునిగిపోయింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబై నగరం వర్షపునీటిలో చిక్కుకుంది. అనేక లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా నీటమునిగిపోయాయి. 
 
గత కొన్ని రోజులుగా ముంబై మహానగరంపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపుతున్న విషయం తెల్సిందే. ఫలితంగా ఇప్పటికే అనేక ప్రాంతాలన్నీ నీటమునిగిపోయాయి. ఈ పరిస్థితులలో వచ్చే నాలుగు ఐదు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. 
 
పైగా, ముంబై నగర వాసులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు ముంబైలో వరదల తీవ్రతకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భారీ వర్షానికి వరదనీరు బీఎంసీ బస్సులోకి వచ్చేశాయి. దీంతో పలువురు ప్రయాణికులు బస్సులోని వెనుక భాగానికి వచ్చేయగా, కొందరు మాత్రం బస్సు ముందు భాగంలోనే కూర్చున్నారు. అలాగే అనేక లోకల్ రైలు సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడింది. పట్టాలపై వరద నీరు వచ్చి నిలిచివుండటంతో అనేక సర్వీసులను రద్దు చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments