కోల్హాపూర్ - ముంబై మధ్య నడిచే మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ రైలు ఉల్హాన్ సాగర్ వద్ద వరద నీటిలో చిక్కుకుపోయింది. భారీగా వరద నీరు రైల్వే ట్రాక్‌పైకి వచ్చి చేరడంతో రైలును అక్కడే ఆపివేశారు. మొత్తం 700 మంది ప్రయాణికులున్న రైలులో ఇప్పటికే 600 మందిని వివిధ మార్గాల ద్వారా సురక్షితంగా తరలించారు.
వేకువ జామున ఈ సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం అక్కడకు చేరుకుంది. వారితో పాటు పోలీసులు, రైల్వే సిబ్బంది, రైల్వే రక్షక దళాలు, ఇతర సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
సిబ్బంది హెలికాప్టర్ల ద్వారా అక్కడకు చేరుకుని ప్రయాణీకులను బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎలాంటి భయాందోళనకు గురి కావద్దనీ, అందరినీ సురక్షితంగా తరలిస్తామని అధికారులు మైకుల ద్వారా వెల్లడిస్తున్నారు. చూడండి వీడియో...