Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలపరీక్షలో నెగ్గిన కుమార స్వామి.. కొలువుదీరనున్న సంకీర్ణ సర్కారు..

కర్ణాటకలో హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలో సంకీర్ణ సర్కారు ఏర్పాటు కానుంది. కర్ణాటక అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో కుమారస్వామి నెగ్గారు. తద్వారా కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ కేబినెట్ కొలువు దీరనుంద

Webdunia
శుక్రవారం, 25 మే 2018 (17:51 IST)
కర్ణాటకలో హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలో సంకీర్ణ సర్కారు ఏర్పాటు కానుంది. కర్ణాటక అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో కుమారస్వామి నెగ్గారు. తద్వారా కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ కేబినెట్ కొలువు దీరనుంది. కర్ణాటకలో బీజేపీ గెలిచినా.. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు జేడీఎస్, కాంగ్రెస్ కలవడంతో బీజేపీకి అధికారం దక్కలేదు.
 
ముందుగానే బీజేపీ అభ్యర్థి బీఎస్ యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రమాణ స్వీకారం చేయించినా.. జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు ఏకం కావడంతో పాటు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జరిగిన విశ్వాస పరీక్షకు ముందే యడ్డీ తన పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా కుమారస్వామికి కర్ణాటక సీఎంగా పట్టాభిషేకం జరిగింది. ఆపై శుక్రవారం అసెంబ్లీ బలపరీక్ష కూడా జరిగింది. 
 
ఈ బలపరీక్షకు ముందే సభ నుంచి బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలో సభలో మిగిలిపోయిన జేడీఎస్, కాంగ్రెస్ సభ్యులంతా బలపరీక్షకు మద్దతుగా చేతులెత్తారు. బలపరీక్షకు వ్యతిరేకంగా ఏ ఒక్కరూ చేతులెత్తలేదు. ఈ క్రమంలో కుమారస్వామికి 117 మంది సభ్యుల మద్దతు లభించింది. దీంతో, బలపరీక్షలో కుమారస్వామి నెగ్గినట్టు స్పీకర్ ప్రకటించారు.
 
మరోవైపు కర్ణాటకలో బీజేపీ చేతిలో తాము కీలుబొమ్మలం కాదని.. బీజేపీ ఆడమన్నట్టు తామేమీ ఆడమని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే శివకుమార్ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గిన అనంతరం శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోగా రైతు రుణాలు మాఫీ చేయకపోతే ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్త బంద్ చేపడతామని బీజేపీ హెచ్చరించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా బీజేపీ బ్లాక్ మెయిల్ చేయలేదని.. రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా వ్యవహరిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments