Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుదిరిన పదవుల డీల్.. నేడు కుమార పట్టాభిషేకం.. చంద్రబాబు హాజరు

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ముఖ్యంగా, ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఇరు పార్టీల మధ్య మంత్రిపదవుల పంపిణీపై డీల్ కుదిరింది. ఈ డీల్ ప్రకారం మొత్

కుదిరిన పదవుల డీల్.. నేడు కుమార పట్టాభిషేకం.. చంద్రబాబు హాజరు
, బుధవారం, 23 మే 2018 (11:43 IST)
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ముఖ్యంగా, ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఇరు పార్టీల మధ్య మంత్రిపదవుల పంపిణీపై డీల్ కుదిరింది. ఈ డీల్ ప్రకారం మొత్తం 34 మంత్రిదవుల్లో కాంగ్రెస్‌కు 22, జేడీఎస్‌కు 12 చొప్పున ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయించాయి. అలాగే, ముఖ్యమంత్రిగా కుమార స్వామి, ఉప ముఖ్యమంత్రిగా పరమేశ్వరలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
 
అలాగే, ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్‌కు స్పీకర్, జేడీఎస్‌కు డిప్యూటీ స్పీకర్‌ పదవులు దక్కాయి. స్పీకర్‌గా కాంగ్రెస్‌ నేత కేఆర్‌ రమేశ్‌ కుమార్‌ను ఈ నెల 25న ఎన్నుకోనున్నారు. బల నిరూపణ తర్వాతే మంత్రి పదవుల అంశంలో శాఖల కేటాయింపుల ప్రక్రియ ఉంటుందని కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. కాగా, కుమారస్వామి ఈ నెల 24న బలపరీక్ష ఎదుర్కోనున్నారు. 
 
మరోవైపు, ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ అతిరథలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆ పార్టీ సీనియర్ నేతలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు... ఇతర పార్టీల నేతలు హాజరుకానున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తూత్తుకుడి రక్తసిక్తం.. రేయ్.. ఒక్కడైనా చావాలి.. ఖాకీల కామెంట్స్ (Video)