Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కర్ణాటక కింగ్‌గా కుమారస్వామి.. శ్రీరంగంలో ప్రత్యేక పూజలు.. తిరుమల శ్రీవారి దర్శనం..?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ అయిన కుమార స్వామి.. సీఎం పీఠాన్ని అధిరోహించనున్నారు. మెజారిటీ సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 111 మంది ఎమ్మెల్యేల మద్దతు లేక ప

కర్ణాటక కింగ్‌గా కుమారస్వామి.. శ్రీరంగంలో ప్రత్యేక పూజలు.. తిరుమల శ్రీవారి దర్శనం..?
, ఆదివారం, 20 మే 2018 (14:54 IST)
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ అయిన కుమార స్వామి.. సీఎం పీఠాన్ని అధిరోహించనున్నారు. మెజారిటీ సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 111 మంది ఎమ్మెల్యేల మద్దతు లేక  ప్రమాణస్వీకారం చేసి మరీ రాజీనామా చేశారు బీజేపీ నేత యడ్యూరప్ప.


ఈ తరుణంలో మిత్రపక్షాలైన కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. కాంగ్రెస్‌కు 76 జేడీఎస్‌కు 38మంది శాసనసభ్యులు ఉన్నారు. వీరి మధ్య పొత్తు కుదరడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు జేడీఎస్ నేతలు.
 
అసెంబ్లీలో జరిగిన వివరాలను పత్రాల రూపంలో సుప్రీం కోర్టుకు సమర్పించాల్సి వుంది. అనీ కుదిరితే మే 23న బుధవారం సాయంత్రం కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక కర్ణాటక డిప్యూటీ సీఎంగా తాజా మాజీ మంత్రి డీకే శివకుమార్ లేదా కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) అధ్యక్షుడు పరమేశ్వర ప్రమాణస్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది.
 
కర్ణాటక సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న జేడీఎస్ నేత కుమార స్వామి.. ప్రమాణ స్వీకారానికి ముందే పలు దేవాలయాలను సందర్శించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తమిళనాడుకు బయలుదేరనున్నారు. తిరుచ్చి చేరుకుని శ్రీరంగం ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం నేరుగా తిరుమలకు కుమారస్వామి వెళతారని జేడీఎస్ వర్గాల సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ బస్సు యాత్ర ప్రారంభం.. 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.. జనసేనాని