Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్‌ ట్రెండ్స్‌లో అగ్రస్థానం.. రాధిక కుమారస్వామి పేరు వైరల్.. ఎన్టీఆర్ హీరోయిన్?

కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కాబోయే కర్ణాటక సీఎంకు భార్య కావడంతో పాటు శాండల్‌వుడ్‌లో ప్రముఖ నటి, నిర్మాత రాధిక కుమారస్వామి పేరు మారు మోగిపోతోంది. మే 13 నుంచి మే 19 మధ్య కాలంలో.. ''రాధిక కుమారస్వామి'' అనే

Webdunia
సోమవారం, 21 మే 2018 (10:11 IST)
కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కాబోయే కర్ణాటక సీఎంకు భార్య కావడంతో పాటు శాండల్‌వుడ్‌లో ప్రముఖ నటి, నిర్మాత రాధిక కుమారస్వామి పేరు మారు మోగిపోతోంది. మే 13 నుంచి మే 19 మధ్య కాలంలో.. ''రాధిక కుమారస్వామి'' అనే పదం గూగుల్‌ ట్రెండ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది.


గూగుల్‌ ట్రెండ్స్‌ భారత్‌లో సెర్చింజన్‌లకు సంబంధించిన వంద పాయింట్స్ ఇస్తే.. అది అత్యున్నతమైన సెర్చ్ పదమని అర్థం. ఈ నేపథ్యంలో  రాధిక కుమార స్వామి పేరు.. ఖతార్‌లో అనూహ్యంగా 38 పాయింట్లు సాధించింది. ఇదే తరహాలో యూఏఈలో 22, శ్రీలంకలో 19, కువైత్‌లో 18 పాయింట్లు రావడం గమనార్హం.
 
రాధిక కుమార స్వామి గురించి.. 
కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి కుమార స్వామికి ఆమె రెండో భార్య. గతంలో దక్షిణాది భాషల్లో హీరోయిన్‌గా నటించారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో రాధిక కుమార స్వామి పేరు గూగుల్ టాప్ సెర్చ్ ట్రెండింగ్‌లో ఉంది. రాజకీయాల్లో ఈమె లేకున్నా, రాధికకు ఉన్న సినిమా నేపథ్యం ఆమెను పాపులర్ చేసింది. ఆమెకు సంబంధించిన వివరాల గురించి నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. 
 
తన 16వ ఏటనే తొలిసారిగా వెండితెరపై కనిపించిన ఆమె, మొదట శాండల్ వుడ్‌ను తన అందంతో ఊపేశారు. టాలీవుడ్‌లో నందమూరి తారకరత్న హీరోగా చేసిన 'భద్రాద్రి రాముడు' చిత్రంలో రాధికే హీరోయిన్. ఆ తరువాత తెలుగులో పెద్దగా కనిపించకపోయినా, 'అరుంధతి' సూపర్ హిట్ తరువాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన గ్రాఫిక్స్ చిత్రం 'అవతారం'లో రాధిక హీరోయిన్‌గా నటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments