Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మ‌హాన‌టి'కి అరుదైన గౌర‌వం.. ఇండియ‌న్ ప‌నోర‌మాకి ఎంపిక‌

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2018 (19:44 IST)
వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్న సినిమాస్ సంయుక్తంగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం `మ‌హాన‌టి.` సావిత్రి జీవిత క‌థ `మ‌హాన‌టి`గా తీర్చిదిద్దితే... తెలుగు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. వ‌సూళ్ల‌తో నీరాజ‌నాలు అందించారు. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లూ ల‌భించాయి. ఇప్పుడు మ‌హాన‌టికి అరుదైన గౌర‌వం ద‌క్కింది.
 
ఇండియ‌న్ ప‌నోర‌మాలో తెలుగు చిత్ర‌సీమ నుంచి ప్ర‌దర్శ‌న కోసం `మ‌హాన‌టి` ఎంపికైంది. కీర్తి సురేష్‌, స‌మంత‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ  ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ఈ చిత్రానికి నాగ అశ్విన్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే.
 
 49వ‌ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ ఎఫ్ఐ) ఉత్స‌వాలు త్వ‌ర‌లో గోవాలో జ‌ర‌గ‌నున్నాయి. అందులో భాగంగా `మ‌హాన‌టి`ని ప్ర‌ద‌ర్శిస్తారు.
 
హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళం, తుళు... ఇలా భార‌తీయ భాష‌ల నుంచి 22 చిత్రాలు ఈ చిత్రోత్స‌వాల్లో ప్ర‌ద‌ర్శ‌న‌కు నోచుకున్నాయి. తెలుగు నుంచి ఆ గౌర‌వం మ‌హాన‌టికి మాత్ర‌మే ద‌క్కింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments