Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివుడి చేతిలో మద్యం గ్లాసు, మరో చేతిలో మొబైల్ ఫోన్.. ఇన్‌స్టాగ్రామ్

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (12:14 IST)
హిందువుల మనోభావాలను ఇన్‌స్టాగ్రామ్‌ దెబ్బతీస్తున్నట్లు ఢిల్లీకి చెందిన బీజేపీ నేత ఫిర్యాదు చేశారు. జిఫ్ ఫార్మాట్‌లో శివుడిని అనుచిత రీతిలో ఆ యాప్ చిత్రీకరించినట్లు మనీష్ సింగ్ ఆరోపించారు. 
 
ఒక చేతిలో మద్యం గ్లాసు, మరో చేతిలో మొబైల్ ఫోన్‌తో ఉన్న శివుడి జిఫ్‌ ఇమేజ్‌లను ఇన్‌స్టాలో పోస్టు చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ నేత.. పార్లమెంట్ వీధిలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో .. ఇన్‌స్టాగ్రామ్ సీఈవో, ఇతర అధికారులపై ఫిర్యాదు నమోదు చేశారు. 
 
శివుడిని లక్షల సంఖ్యలో హిందువులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారని, ఆయన్ను ఆది దేవుడిగా ఆరాధిస్తారని, గ్రాఫిక్స్ ఫార్మాట్‌లో పరమేశ్వరుడిని అభ్యంతరకర రీతిలో చిత్రీకరించారని మనీష్ సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే ఆ జిఫ్‌ను తయారు చేసినట్లు ఆయన ఆరోపించారు. 
 
హిందువులను రెచ్చగొట్టి, విద్వేషాలు క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శివుడిని అవమానకర రీతిలో చిత్రీకరించిన ఇన్‌స్టాగ్రామ్ సీఈవోపై క్రిమినల్ కేసు పెట్టాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments