Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ఉద్వాసన? సర్వేలో బీజేపీ బిజీ

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (11:28 IST)
కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్పకు ఉద్వాసన పలకాలన్న డిమాండ్లు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. దీంతో ఆయన్ను సీఎం కుర్చీ నుంచి తప్పించాలా? వద్దా? అనే విషయంపై భారతీయ జనతా పార్టీ అధిష్టానం అభిప్రాయ సేకరణలో నిమగ్నమైవుంది. 
 
దక్షిణాదిలో బీజీపీని అధికారంలోకి తెచ్చిన ఘనత యడ్యూరప్పకే దక్కుతుంది. అప్పటి నుంచి ఆయన ఆ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఇటీవలి కాలంలో ఆయనపై అనేక విమర్శలు వస్తున్నాయి. సీఎం యడియూరప్పపై అసంతృప్తిగా ఉన్న పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 
 
దీంతో ఈ దిశగా అధిష్టానం దృష్టిసారించింది. పైగా, అభిప్రాయ సేకరణకూ నడుంబిగించింది. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ముఖ్యమంత్రిపై అభిప్రాయ సేకరణలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. వారు ఇచ్చే నివేదిక అనంతరం ముఖ్యమంత్రి మార్పుపై అధిష్ఠానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
 
నిజానికి బీజేపీలో సంతకాల సేకరణ అనే సంప్రదాయం లేదు. అయితే, ముఖ్యమంత్రి యడ్డీకి వ్యతిరేకంగా కొందరు సంతకాల సేకరణ చేపట్టినట్టు వార్తలు వచ్చాయి. మరోవైపు, యడియూరప్ప మద్దతుదారులు 65 మంది తమ అభిప్రాయాన్ని అధిష్ఠానానికి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 
పార్టీ శాసనసభాపక్ష సమావేశాన్ని కనుక నిర్వహిస్తే తమ అభిప్రాయాన్ని చెబుతామని పలువురు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. అది కూడా అధిష్ఠానం నుంచి వచ్చే నేత సమక్షంలోనే ఈ సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
 
బీజేపీ చీఫ్ విప్ సునీల్ కుమార్ కూడా సమావేశాన్ని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలంటూ ట్వీట్ చేయడం యడ్డీపై వ్యతిరేకతకు అద్దం పడుతోందని చెబుతున్నారు. కాగా, పార్టీ బాధ్యుడు అరుణ్‌సింగ్ త్వరలోనే బెంగళూరు వచ్చి తాజా పరిణామాలపై ఆరా తీయనున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొణిదల రెండోవ సినిమా

Sunitha Williams: సునీతా విలియమ్స్ కు నిజమైన బ్లూ బ్లాక్ బస్టర్ : మెగాస్టార్ చిరంజీవి

Mohanlal: ఐమ్యాక్స్‌లో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా L2E: ఎంపురాన్‌ : మోహ‌న్ లాల్‌

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments