Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే కాన్పులో పది మందికి జన్మనిచ్చిన ఆఫ్రికా మహిళ.. గిన్నిస్ రికార్డ్

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (11:20 IST)
ఒకే కాన్పులో పది మందికి జన్మనిచ్చింది ఆఫ్రికా మహిళ. తద్వారా వండర్ ఉమెన్‌గా నిలిచింది. అంతేగాకుండా.. పదిమంది శిశువులకు జన్మనివ్వడం ద్వారా ఈ ఆఫ్రికా మహిళ గిన్నిస్ రికార్డులో నిలిచింది. వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ ఏకంగా ఒకే కాన్పులో 10 మంది పిల్లలకు జన్మనిచ్చి రికార్డు నెలకొల్పింది. తాను ఒకే కాన్పులో 10 మంది పిల్లలకు జన్మనిచ్చినట్లు దక్షిణాఫ్రికాకు చెందిన గొసియామీ థామర సిట్‌హోల్‌ (37) అనే మహిళ ప్రకటించింది.
 
ప్రిటోరియా నగరంలో సోమవారం రాత్రి తన భార్యకు సిజేరియన్‌ (సి–సెక్షన్‌) ద్వారా ప్రసవం జరిగిందని, ఏడుగురు మగ శిశువులు, ముగ్గురు ఆడ శిశువులు జన్మించారని ఆమె భర్త టెబోగో సోటెట్సీ చెప్పారు.తన భార్య గర్భం దాల్చి 7 నెలల 7 రోజులైందని, నెలలు నిండకుండానే 10 మందికి జన్మనిచ్చిందని టెబోగో సోటెట్సీ తెలిపాడు. తనకు చాలా ఆనందంగా ఉందని, ప్రస్తుతం ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనంటూ భావోద్వేగానికి గురయ్యారు. 
 
అయితే ఒకే కాన్పులో 10 జన్మించారని దంపతులు చెబుతున్న విషయాన్ని వైద్యులు ఇంకా ధ్రువీకరించలేదు. ఒకవేళ ఇదే నిజమైతే ఒకే కాన్పులో ఇంతమంది పిల్లలు పుట్టడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అవుతుందని చెబుతున్నారు. సిట్‌హోల్‌ గతంలోనూ కవలలకు జన్మనిచ్చింది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments