కన్నీళ్లు పెట్టుకున్న వరుడు.. ఎందుకో తెలుసా?

Webdunia
శనివారం, 16 జనవరి 2021 (10:29 IST)
Hyderabadi NRI
సాధారణంగా వివాహం అంటేనే వరుడు ఎగిరి గంతేస్తాడు. కానీ ఇక్కడ ఓ వరుడు మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎందుకంటే తన పెళ్లికి నాన్న హాజరు కాలేదని భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సంఘటన జెడ్డాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ సంతోష్ నగర్‌కు చెందిన మహ్మద్ ఇమ్దాద్ అలీ జెడ్డాలో ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు.
 
అయితే అలీ వివాహం గతేడాది మార్చిలో జరపాలని జెడ్డాలోనే నిర్ణయించారు. ఎందుకంటే అలీ బంధువులు దాదాపు అక్కడే స్థిరపడ్డారు కాబట్టి. అంతలోనే కరోనా లాక్‌డౌన్ విధించడంతో పెళ్లి వాయిదా పడింది. అలీ తల్లిదండ్రులు జెడ్డా వెళ్లలేకపోయారు. 
 
ఇప్పటికీ కూడా వారికి వీసా రాలేదు. దీంతో పెళ్లి ఆలస్యమవుతుందని భావించి ఇరు కుటుంబాల పెద్దలు లేకుండానే నిఖా జరపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో వరుడు తల్లిదండ్రులు లేకుండానే అలీ నిఖా జరిపించారు. ఈ సమయంలో తండ్రిని గుర్తు చేసుకుని అలీ భావోద్వేగానికి లోనయ్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కల్యాణ్ గారిని అలా ఎలా అనాలనిపించిందమ్మా?: సుగాలి ప్రీతి తల్లి వ్యాఖ్యలపై హైపర్ ఆది

Pooja Hegde: జిమ్ దుస్తులలో కలిసి కనిపించిన వరుణ్ ధావన్, పూజా హెగ్డే

తాతకు పుష్పాంజలి ఘటించిన ఎన్టీఆర్ - స్మరించుకున్న చిరంజీవి

Alia Bhatt : ఆల్ఫా లో ఆలియా భ‌ట్, శ‌ర్వారి భారీ యాక్షన్ సీన్స్ థ్రిల్లింగ్‌ వుంటాయి: బాబీ డియోల్

Suriya :సూర్య, వెంకీ అట్లూరి చిత్రం‘విశ్వనాథ్ & సన్స్ కు స్వాతంత్య్రం

తర్వాతి కథనం
Show comments