Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రుతుక్రమంలో యువతి వివాహం.. అపవిత్రం చేసిందని విడాకులు.. అసలు సంగతేంటంటే?

Advertiesment
రుతుక్రమంలో యువతి వివాహం.. అపవిత్రం చేసిందని విడాకులు.. అసలు సంగతేంటంటే?
, శుక్రవారం, 25 డిశెంబరు 2020 (11:55 IST)
నెలసరిలో వివాహం చేసుకున్న యువతికి వరుడు విడాకులు ఇచ్చింది. రుతుక్రమం సమయంలో వివాహం చేసుకోవడం ఆ వరుడికి తెలియదు. అయితే ఈ విషయాన్ని దాచి వివాహం చేసుకుందని.. ఇది మహాపాపమని.. వరుడు పెద్ద రాద్దాంతం చేశాడు. అంతటితో ఊరుకోకుండా ఏకంగా విడాకులు కోరిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోనే వడోదరాలో జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. వడోదరాకు చెందిన ఓ యువకుడు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి గత జనవరిలో టీచర్‌గా పనిచేసే ఓ యువతితో వివాహం జరిగింది. వధువు సరిగ్గా పెళ్లిరోజు వధువుగా ఉన్న ప్రస్తుత భార్య నెలసరిలో ఉండి వివాహం చేసుకుంది. ఆ విషయాన్ని వివాహం జరిగిన తరువాత ప్రత్యేక పూజ కోసం ఓ దేవాలయంలోకి వెళ్లే కొద్ది క్షణాల ముందు తన భార్య తాను 'బహిష్టు'లో ఉన్నానని చెప్పింది.
 
దాంతో అతను అతని తల్లి గొడవ చేశారు. పెళ్లిని అపవిత్రం (బహిష్టు) సమయంలో చేసుకోవటం చాలా చాలా పాపం అని అన్నారు. ఆ గొడవ విడాకుల వరకూ వెళ్లింది. రుతుక్రమంలోనే తనను పెళ్లి చేసుకుందని ఇది తమ విశ్వాసాలకు భంగం కలిగించే అత్యంత పెద్ద విషయం అని ఈ భార్య తనుకు వద్దంటూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ విషయం ఒక్కటే విడాకులు మంజూరు కోసం సరిపోదని సదరు భర్త వివాహం జరిగిన నాటి నుంచి అస్తమానం ఆమె తనతో ఏదో ఒక గొడవపెట్టుకుని పుట్టింటికి వెళ్లిపోతుందని అతడు తన పిటిషన్‌లో ఆరోపించాడు.
 
కానీ ఆ యువతి మాత్రం ఇదో పెద్ద విషయమే కాదు..దీని కోసం విడాకులు కోరటమేంటంటూ ప్రశ్నిస్తోంది. అసలు విషయం తాను బహిష్టు సమయంలో వివాహం చేసుకున్నందుకు కాదనీ..తన వివాహం జరిగిన తరువాత కూడా టీచర్ గా పనిచేసే తన జీతంలోంచి తన అన్నకు ప్రతీ నెలా రూ.5వేలు ఇస్తున్నానని అందుకు తన భర్తా, అత్తింటివారి గొడవచేస్తున్నారని తెలిపింది. 
 
తన పెళ్లికి చేసిన ఖర్చులతో చాలా అప్పుల పాలయ్యాడని దానికి తన వంతుగా సహాయం చేయటానికి ప్రతీ నెలా రూ.5వేలు ఇస్తున్నానని ఆ విషయం తన భర్తకు., అత్తింటివారికి నచ్చగా ఇలా రుతుక్రమంలో పెళ్లి చేసుకున్నాననే వంకతో విడాకులు కోరుతున్నారంటూ వాపోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంట్లోకి ప్రవేశించిన నల్లత్రాచు... చిన్నారులు మాత్రమే వుండటంతో..