#DKShivakumararrested బీజేపీ ప్రతీకార, కక్ష సాధింపు రాజకీయాల బాధితుడిని...

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (10:00 IST)
కర్నాటక రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. నాలుగు రోజుల విచారణ తర్వాత ఆయన్ను ఈడీ అధికారులు అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. హవాలా లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆయన్ను ఈడీ అరెస్టు చేసింది. 
 
ఈ కేసులో శివకుమార్‌ను తమ కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉన్నందున అరెస్టు చేశామని, బుధవారం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టి తమ కస్టడీకి అప్పగించాలని కోరుతామని ఈడీ అధికారులు తెలిపారు. కాగా, ఈ అరెస్టుపై డీకే శివకుమార్ స్పందించారు. తనను అరెస్ట్‌ చేయాలన్న లక్ష్యాన్ని విజయవంతం చేసుకున్న తన 'బీజేపీ మిత్రులను' అభినందిస్తున్నానని ట్వీట్‌ చేశారు. 
 
'నాకు వ్యతిరేకంగా ఐటీ, ఈడీ నమోదు చేసిన కేసులు రాజకీయ ప్రేరేపితం. నేను బీజేపీ ప్రతీకార, కక్ష సాధింపు రాజకీయాల బాధితుడ్ని. నాకు దేవుడిపై, న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. కక్ష సాధింపు చర్యలపై విజయం సాధించి బయటకు వస్తా' అని ధీమా వ్యక్తం చేశారు. 
 
కాగా, శివకుమార్‌తోపాటు ఢిల్లీలోని కర్ణాటక భవన్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్న హనుమంతయ్య తదితరులపై గతేడాది సెప్టెంబర్‌లో ఈడీ కేసు నమోదుచేసింది. పన్ను ఎగవేత, కోట్ల రూపాయల హవాలా లావాదేవీలపై ఐటీ శాఖ గతేడాది బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో కేసు నమోదు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

తర్వాతి కథనం
Show comments