పంచభూతాలలో ఒకటైన భూమిని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఎర్త్ డేని ప్రతి ఏటా జరుపుకుంటారు. మానవులకు ఆధారమైన భూమిని పూర్వీకులు పూజించేవారు. అయితే ప్రస్తుతం భూమి ప్రస్తుత ఆధునిక ప్రజలు ఏమాత్రం లెక్క చేయట్లేదు. భూమిని, మట్టిని కలుషితం చేసేస్తున్నారు.
అందుకే భూ పరిరక్షణ కోసం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22ను ఎర్త్ డేను జరుపుకుంటున్నారు. ఎర్త్ డేకు సంబంధించి అవగాహన కల్పించడానికి వివిధ కార్యక్రమాలు, సెమినార్లు నిర్వహించడం జరుగుతాయి.
కాలుష్యం, అటవీ నిర్మూలన మరియు గ్లోబల్ వార్మింగ్‌తో సహా సమస్యల గురించి అవగాహన కల్పించడం ఈ రోజు లక్ష్యం. ఎర్త్ డే 2022 యొక్క థీమ్ "ఇన్వెస్ట్ అవర్ ప్లానెట్". ఈ థీమ్ స్థిరమైన విధానాల వైపు మారాలని పిలుపునిస్తుంది.
ఐక్యరాజ్యసమితి ఈ రోజును అంతర్జాతీయ మదర్ ఎర్త్ డేగా జరుపుకుంటుంది. ఇది "ప్రకృతితో సామరస్యం" అనే ఇతివృత్తంతో ఈ రోజును సూచిస్తుంది.
1970 ఏప్రిల్ 22న మొదటి భూదినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా, 150 సంవత్సరాల పారిశ్రామిక అభివృద్ధితో భూమికి ఏర్పడిన చెడు ప్రభావాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
Earth Day 2022
ఇందుకోసం 20 మిలియన్ల మంది నగరాలలో వీధుల్లోకి వచ్చారు. ఆందోళన చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎర్త్ డే భూ పరిరక్షణకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఇంకేముంది.. ఎర్త్ డే సందర్భంగా భూ పరిరక్షణలో మనం కూడా పాలుపంచుకుందాం..